అల్లు అర్జున్ కేసు ప్రభావం నాగ చైతన్య తండేల్ సినిమా పై?

First Published | Dec 28, 2024, 4:23 PM IST

అల్లు అర్జున్ కేసు నేపథ్యంలో నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కావాల్సి ఉండగా, అల్లు అర్జున్ కేసు కారణంగా ఏప్రిల్ కు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.

అల్లు అర్జున్ కేసు గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పై విమర్శలు వచ్చినా ఆయన తాజా చిత్రం పుష్ప 2 పై ఏ మాత్రం ప్రభావం చూపించటం లేదు. భారీగా కలెక్షన్స్ నమోదులు అవుతున్నాయి. అయితే ఈ కేసు నడుస్తున్న సమయంలో అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులపై ఇంపాక్ట్ పడేలా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నాగచైతన్య తాజా చిత్రం తండేలు వాయిదా పడే సిట్యువేషన్ కనపడుతోందని ట్రేడ్ అంటోంది. 

Naga Cahitanya starrer Thandel film song out


నాగచైతన్య (Naga Chaitanya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్. ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపధ్యంలో  ఈ సినిమా విడుదల తేదీపై (Tandel release date) క్లారిటీ ఇస్తూ ఆ మధ్యన చిత్ర టీమ్ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటీలతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీవాసులు పాల్గొన్నారు.  సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 



వాలెంటైన్స్ వీక్‌ ప్రారంభానికి ముందు ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సాయి పల్లవి తనకు కుమార్తెతో సమానమని అల్లు అరవింద్‌ అన్నారు. తాజాగా విడుదలైన ‘అమరన్‌’ చూసి ఎమోషనల్‌ అయినట్లు చెప్పారు. సాయిపల్లవికి ఫోన్‌ చేసి ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్దితులు తారు మారు అయ్యాయి. ఈ చిత్రం రీలిజ్ అనుకున్నట్లుగా పిభ్రవరి 7 న రిలీజ్ కాకపోవచ్చు అని ట్రేడ్ అంటోంది. ఏప్రియల్ కు వాయిదా పడే అవకాసం ఉందంటున్నారు. 
 


తండేలు చిత్రం టీమ్ ...డిసెంబర్ నుంచే ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలెడదామనుకున్నారు. అయితే అల్లు అర్జున్ మీద కేసు నమోదు కావటంతో అన్న తారుమారు అయ్యాయి. ఇప్పటికే విడుదలైన బుజ్జి తల్లి సాంగ్ మంచి స్పందన తెచ్చుకోగా, మేకర్స్ ఇప్పుడు రెండో పాట కోసం ప్రేక్షకులను రెడి చేయటానికి సిద్దమయ్యారు. 
శివశక్తి ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అది జరగలేదు. 
 


గతంలో తండేల్ మూవీ స్టోరీలైన్‌ను నాగ‌చైత‌న్య రివీల్ చేశాడు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు నాగ‌చైత‌న్య చెప్పాడు. 2018లో శ్రీకాకుళానికి చెందిన ఓ జాల‌రి పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. అత‌డిని పాకిస్థాన్ నేవీ అరెస్ట్ చేసింది. ఆ సంఘ‌ట‌న స్ఫూర్తితో తండేల్ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు చైతన్య తెలిపాడు.

ఏడాదిన్న‌ర పాటు పాకిస్థాన్ జైలులో శిక్ష‌ను అనుభ‌వించిన ఆ జాల‌రి ఎలా రిలీజ‌య్యాడు? ఆ జాలరిని క్షేమంగా ఇండియా ర‌ప్పించేందుకు అత‌డి ప్రియురాలు ఎలాంటి పోరాటం చేసింద‌నే అంశాల‌ను తండేల్ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు నాగ‌చైత‌న్య తెలిపాడు. దేశభక్తి జానర్ కూడా తోడైన ఈ ప్రేమ కథను అతడు ఎలా తెరకెక్కిస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Naga Chaitanya Thandel film story revealed


నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్‌ డేట్‌ను ముందుగా అనుకొని..దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. దాని వల్ల తప్పులు జరిగేవి.  సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్‌ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఈ చిత్రంతో అది నెరవేరింది. అల్లు అరవింద్ కూడా ఇలానే ఆలోచించారు. చాలా ఆనందించాను. ఇది గొప్ప చిత్రం. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం.

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్‌ గురించి వినగానే నాకు చేయాలని అనిపించింది. నేను చేస్తానని బన్నివాసుని అడిగాను. పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపాం. నన్ను తెరపై బాగా చూపించాలని చందూ కష్టపడ్డారు. ఆయన నాకు మంచి స్నేహితుడితో సమానం. సాయి పల్లవితో డ్యాన్స్‌ చేయడం చాలా కష్టం. ఆమె క్వీన్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌’ అని ప్రశంసించారు.

Latest Videos

click me!