వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఎంపీడీఓను పరామర్శించిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చారు. అభిమానుల నినాదాలపై ఆయన చిరాకు వ్యక్తం చేశారు.
గత కొద్ది రోజులుగా మీడియా లో ఎక్కడ విన్నా అల్లు అర్జున్ అరెస్ట్ గురించిన వార్తలే. ఈ విషయమై ఇప్పటికే చాలా మంది స్పందించారు. రాజకీయనాయకులు సైతం ఈ విషయమై మాట్లాడుతూ వచ్చారు. ఈ విషయం లీగల్ పరిధిలో ఉండటంతో మరికొందరు మాట్లాడటానికి ఇష్టపడలేదు.
కానీ ఇంత వ్యవహారం నడుస్తుంటే మెగా ఫ్యామిలీ లో ఒక్కరు కూడా ఈ ఘటనపై బహిరంగంగా మాట్లాడడం జరగలేదు. చిరంజీవి, నాగబాబు వంటి వారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఆయన ఇంటికి వెళ్లారు కానీ, ఎక్కడా కూడా ఈ ఘటనపై స్పందించలేదు. అయితే నేడు పవన్ కళ్యాణ్ ని స్పందించమని మీడియావారు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. ఈ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసారు..
25
Pawan Kalyan,
వివరాల్లోకి వెళ్తే నిన్న కడప లో వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఎంపీడీఓ జవహార్ బాబు ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ విచ్చేశాడు. దాడి చేసిన వైసీపీ నాయకులపై ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో చాలా తీవ్రమైన యాక్షన్స్ తీసుకున్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. జవహర్ బాబు ని మరియు అతని కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియా సమావేశం లో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు.
35
Pawan Kalyan
మీడియా సమావేశం చివర్లో ఒక రిపోర్టర్ ‘సార్..అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి?’ అని అడగగా, దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం ఏమిటి..?, హాస్పిటల్ దగ్గర మీరు ఇలాంటి ప్రశ్నలా అడిగేది. ఈ ఘటనపై సంబంధిత ప్రశ్నలు మాత్రమే వెయ్యండి’ అంటూ చెప్పుకొచ్చారు.
45
మరో ప్రక్క పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతున్నంతసేపు అక్కడికి వచ్చిన అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ‘బాబులకు బాబు కళ్యాణ్ బాబు’, ‘ఓజీ..ఓజీ’ అంటూ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయేలా చేసారు. దీనికి మండిపడ్డ పవన్ కళ్యాణ్ ‘ఏంటయ్యా మీరు..ఎక్కడ ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియదా మీకు’ అంటూ చిరాకు పడ్డాడు.
55
ఇలా సమయం, సందర్బం లేకుండా నినాదాలు చేస్తున్నవారిపై పవన్ కళ్యాణ్ చిరాకు పడడం తొలిసారి కాదు, గతంలో రెండు మూడు సార్లు కూడా జరిగాయి. ఉప ముఖ్యమంత్రి హోదా లో ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడికి అభిమానులు వచ్చి పెద్ద ఎత్తున ఓజీ, ఓజీ అని నినదించటం ఆయనకు నచ్చలేదు. నేను సినిమా ఫంక్షన్ కోసం రాలేదు, అభివృద్ధి కార్యక్రమం కోసం వచ్చాను అని ఆయన చెప్పినప్పటికీ కూడా అభిమానులు ఆపడం లేదు. దీంతో ఈరోజు ఆయన బాగా చిరాకు పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.