రాంచరణ్ పుట్టినరోజున తన అవార్డు త్యాగం చేసిన చిరంజీవి.. ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఫోటోలు బయటకి తీసిన మెగాస్టార్

Published : Mar 27, 2026, 06:47 PM IST

రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని రేర్ ఫోటోలని చిరంజీవి పోస్ట్ చేశారు. అదే విధంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు శుక్రవారం రోజు తన 41వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చరణ్ అభిమానులు కూడా బర్త్ డేని సెలెబ్రేట్ చేస్తున్నారు. పెద్ది టీజర్ రిలీజ్ కావడంతో ఆ సంబరాలు అంబరాన్ని అంటాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో రాంచరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరి విషెస్ ఒకెత్తయితే మెగాస్టార్ చిరంజీవి తన తనయుడి కోసం చెప్పిన విషెస్ మరో ఎత్తు.

25
చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

రాంచరణ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడిచే స్థాయి నుంచి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగావు. నేను గర్వపడేలా చేశావు. సినిమా, వ్యక్తిగత జీవితం రెండింటినీ సమతౌల్యంగా నడిపించే తీరు, కుటుంబంపై నీ బాధ్యత, దేవుడిపై నీ నమ్మకం, క్రమశిక్షణ, విలువలు… ప్రతి సారి చూస్తే నీపై నా ప్రేమ, గౌరవం మరింత పెరుగుతూనే ఉన్నాయి. దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రేమ ఎప్పటికీ నీకు తోడుగా ఉండి… నిన్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే డియర్ రాంచరణ్ అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.

35
ఎవ్వరూ చూడని క్యూట్ ఫొటోస్

ఈ పోస్ట్ లో రాంచరణ్ చిన్ననాటి ఫోటోలని చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఎవ్వరూ చూడని క్యూట్ ఫొటోస్ ఇవి. రాంచరణ్ తన తండ్రితో సంతోషంగా గడుపుతున్న దృశ్యాలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి.

45
వివిధ సేవా సంస్థలకు విరాళం

రాంచరణ్ పుట్టిన రోజు, అదే విధంగా శ్రీరామనవమి కావడంతో చిరంజీవి కొన్ని సేవా కార్యకమాలు చెప్పట్టారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తనకి ఇచ్చిన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నగదు బహుమతి రూ 10 లక్షలని చిరంజీవి వివిధ సేవా సంస్థలకు విరాళం ఇచ్చారు. వృద్ధుల కోసం సర్వ్ ఫౌండేషన్ కి.. అంధుల కోసం దేవనార్ ఫౌండషన్ కి.. అదే విధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా చిరంజీవి విరాళం ఇచ్చారు.

55
శ్రీరామనవమి కూడా

ఇటీవల రాంచరణ్ ని కలిసిన వృద్దులని చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ కి ఆహ్వానించారు. వారికి కొత్త బట్టలు పెట్టి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ ఏడాది రాంచరణ్ పుట్టిన రోజు నాడే యాదృచ్చికంగా శ్రీరామనవమి కూడా రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని చిరంజీవి తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories