Jabardasth Varsha: మళ్లీ జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టొద్దు, అసలీ జన్మే వద్దు.. సుమ ముందు జబర్దస్త్ వర్ష కన్నీళ్లు

Published : Mar 27, 2026, 05:01 PM IST

జబర్దస్త్ వర్ష తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తుంది. కానీ తాజాగా ఆమె ఏడిపించింది. తన బాధని పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్‌ సుమ ముందే తనకీ జన్మనే వద్దంటూ ఎమోషనల్‌ అయ్యింది. 

PREV
14
జబర్దస్త్ షోతో పాపులర్‌ అయిన వర్ష

జబర్దస్త్ వర్ష.. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకుంది. స్టార్‌ కమెడియన్‌గా మారిపోయింది. ఆమె ఇమ్మాన్యుయెల్‌తో జోడీ కట్టి జబర్దస్త్ షోలో చేసే కామెడీ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇమ్మాన్యుయెల్‌తో కెమిస్ట్రీ బాగా పండటంతోపాటు ఈ జంటకి విశేషమైన క్రేజ్‌ లభించింది. సుడిగాలి సుధీర్‌, రష్మి జంట తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు, క్రేజీ వీరికే వచ్చిందని చెప్పొచ్చు.

24
అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆర్టిస్ట్ గా వర్ష

ఆ తర్వాత వీరిద్దరి విషయంలోనే అనేక కామెంట్లు, ట్రోల్స్ వచ్చాయి. దీంతో కొన్నాళ్లు షోకే దూరమయ్యింది వర్ష. ఆ తర్వాత అందరి సపోర్ట్ తో, ఫ్యామిలీ సహకారంతో మళ్లీ షోలోకి వచ్చింది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ తోపాటు ఇతర షోస్‌లోనూ మెరుస్తూ అలరిస్తోంది. అంతేకాదు ఓ ఛానెల్‌లో సెలబ్రిటీ ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో ఒకరుగా రాణిస్తోంది వర్ష.

34
యాంకర్‌ సుమ షోలో వర్ష కన్నీళ్లు

తాజాగా జబర్దస్త్ వర్ష ఒక్కసారిగా బరస్ట్ అయ్యింది. తన బాధని పంచుకుంది. తనకు మళ్లీ జన్మ అంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టొద్దు అని చెప్పింది. ఆడపిల్లగా పుట్టను అని, అసలీ జన్మే వద్దు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రామ్‌ ప్రసాద్‌, బుల్లెట్‌ భాస్కర్‌, నూకరాజు, యాంకర్‌ సుమ ముందే ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే.

44
మళ్లీ జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టొద్దు

సుమ కనకాల యాంకర్‌గా నిర్వహిస్తున్న సుమ అడ్డా 369వ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో రాంప్రసాద్‌, బుల్లెట్‌ భాస్కర్‌, నూకరాజు, చలాకీ చంటి, ఫైమా, జబర్దస్త్ వర్ష పాల్గొన్నారు. వీరు చేసిన కామెడీ నవ్వులు పూయించింది. తమదైన ఫన్నీ యాక్టివిటీస్‌, పంచ్‌ డైలాగ్ లతో నవ్వించారు. చివర్లో సుమ.. మీ పాస్ట్‌(గతం)లోనుంచి ఏదైనా ఒక విషయం మార్చుకునే ఛాన్స్ వస్తే, మీరు ఏం మార్చుకుంటారని అడిగింది. ఇందులో జబర్దస్త్ వర్ష స్పందిస్తూ, ఇంకో జన్మంటూ ఉంటే ఎప్పటికీ ఆడపిల్లగా పుట్టకూడదు. ఈ మొఖం వెనుక చాలా బాధ ఉంది అక్కా, చాలా కష్టం ఉంది. మళ్లీ జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టొద్దు, అసలీ జన్మే వద్దు` అంటూ కన్నీరు మున్నీరైంది వర్ష. తాజాగా విడుదలైన సుమ అడ్డా ప్రోమో వైరల్‌ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories