చిరంజీవి అద్భుతమైన నటుడు. కానీ ఆయన రాజశేఖర్ నటన గురించి ప్రశంసలు కురిపించారు. ఆయన తాను కూడా నటించలేనిన అందరిలోనూ ఓపెన్‌గా ప్రకటించారు. మరి ఇది ఎప్పుడు జరిగిందంటే?
చిరంజీవి నో డౌట్ బెస్ట్ యాక్టర్. ఆయన యాక్టింగ్‌కి కోట్లాది మంది అభిమానులున్నారు. భారతదేశంలోనే గర్వించదగ్గ నటుల్లో చిరంజీవి ఒకరు. అంతేకాదు స్టార్ డమ్‌లోనూ ఆయన టాప్‌లోనే ఉన్నారు. బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఓ ఇంగ్లీష్ మేగజీన్ కూడా ప్రకటించిన రోజులున్నాయి. అయితే ఓ సందర్భంలో మాత్రం ఆయన రాజశేఖర్ నటన గురించి ప్రశంసలు కురిపించారు. రాజశేఖర్‌లాగా తాను కూడా చేయలేనని ఓపెన్‌గానే ప్రకటించారు. మరి ఆకథేంటి అనేది చూస్తే,
25
గొడవలకు ముందు చిరంజీవికి, రాజశేఖర్‌కి మంచి అనుబంధం
చిరంజీవి, రాజశేఖర్‌కి మధ్య ఇప్పుడు కొన్ని గొడవలున్నాయి. పార్టీ పరమైన గొడవలని సమాచారం. ఈ క్రమంలో రాజశేఖర్‌పై చిరంజీవి అభిమానులు దాడి కూడా చేశారు. బ్లడ్ బ్యాంక్ విషయంలో రాజశేఖర్ చేసిన ఆరోపణలకు ఆయన జైలుకి వెళ్లినట్టు సమాచారం. కానీ ఒకప్పుడు చిరంజీవి, రాజశేఖర్ మధ్య మంచి అనుబంధం ఉంది. రాజశేఖర్ సినిమా సక్సెస్ మీట్‌లకు, ఈవెంట్లకి, సెలబ్రేషన్స్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కలిసి మంచి పార్టీలు కూడా చేసుకున్నారు.
35
అన్న మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజశేఖర్
అలా `అన్న` సినిమా సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజశేఖర్ హీరోగా నటించిన `అన్న`సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అన్న, తమ్ముడి సెంటిమెంట్ మెయిన్‌గా సినిమా సాగుతుంది. అటవి ప్రాంతంలో ఉండే అన్నాదమ్ముళ్లు పొట్టకూటి కోసం సిటీకి వస్తారు. ఇక్కడ రాజకీయ ఉచ్చులో చిక్కుకుంటారు. రౌడీలకు తమ్ముడు బలవుతాడు. దీంతో అన్నగా రాజశేఖర్ విలన్ల ఆటకట్టించడం, అందుకు కారణమైన రాజకీయ నాయకుల అంతు చూడటమనే కథాంశంతో సినిమా సాగుతుంది.
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గౌతమి, రోజా హీరోయిన్లుగా నటించారు. 1994 ఏప్రిల్ 7న విడుదలైంది. పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో రాజశేఖర్‌లాగా తాను కూడా పర్‌ఫెర్మ్ చేయలేనని ఓపెన్‌గా చెప్పారట. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే నా వల్ల అయ్యేది కాదు, అంత బాగా చేసేవాడిని కాదు అని చెప్పారట. అయితే ఈ సినిమాని హిందీలోనూ చిరంజీవి రీమేక్ చేసే అవకాశం వచ్చిందట. కానీ తాను చేయలేనని తెలిపారు చిరంజీవి. ఈ విషయాన్ని రాజశేఖర్.. టీఎన్‌ఆర్ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
55
హీరోగా కమ్ బ్యాక్ కోసం చూస్తున్న రాజశేఖర్
రాజశేఖర్ చివరగా `బైకర్` మూవీలో ముఖ్య పాత్ర పోషించారు. శర్వానంద్‌కి తండ్రి పాత్ర పోషించారు. ఇందులో ఆయన పాత్ర హీరో రేంజ్‌లో ఉండటం విశేషం. ఆ తర్వాత ఇప్పుడు హీరోగా రెండు సినిమాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు.చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ కి ఆయన పోటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వరుస పరాజయాల కారణంగా డౌన్ అయ్యారు. బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు.