ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచే శ్రీవిష్ణు తాజాగా `కామ్రేడ్ కళ్యాణ్`తో సందడి చేస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా, జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంతో రూపొందిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పణలో స్కంధ వాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే, సత్య, సుదర్శన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగర్, సాయి చంద్, శత్రు కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. మరి బాక్సాఫీసు వద్ద ఎలాంటి రిజల్డ్ ని తెచ్చుకుంటోంది అనేది చూస్తే.