డ్రై యాక్షన్ మూవీగా దీన్ని రూపొందించబోతున్నారు. కొంత రా ఛాయలు కనిపిస్తాయట. మెగాస్టార్‌ని ఓ కొత్త లుక్‌లో చూడబోతున్నారని, ఆయనకు ఇదొక కొత్త తరహా సినిమా అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. నానితో `పారడైజ్` అనే మూవీని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమా ఉండబోతుందట. ఈ లోపు చిరంజీవి `విశ్వంభర` నుంచి ఫ్రీ అవుతారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణతోపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వీఎఫ్‌ఎక్స్ భారీగా ఉంటాయని, అందుకోసమే లేట్ అవుతుందని సమాచారం.