
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో టాప్ స్టార్. తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పటి తరం స్టార్స్ ఎంత మంది వచ్చినా ఆయన్ని కొట్టేవారు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో టాలీవుడ్ లో అత్యంత రిచ్ స్టార్ అని కూడా చెప్పొచ్చు. వందల కోట్లకు అధిపతిగా రాణిస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్స్ లో అత్యంత లగ్జరీ హౌజ్ కూడా చిరంజీవి సొంతం. గతంలో కట్టిన ఇంటిని కొత్తగా రెనోవేషన్ చేశారు. ఇప్పుడు ఆయన ఇంటి లుక్ మొత్తం మారిపోయింది. రాజభవనాన్ని తలపిస్తోంది.
చిరంజీవి కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనేట్టుగా ఆ ఇళ్లు ఉండటం విశేషం. ఇటీవల `కర్లీ టేల్స్` అనే ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానెల్ వాళ్లకి మెగా కోడలు ఉపాసన తన ఇంటిని చూపించారు. ఇంటి వంటకాలను రుచి చూపించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంటిని చిత్రీకరించారు. ఆ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
ఇందులో కొత్త లుక్‌లో చిరంజీవి ఇళ్లు అదిరిపోయేలా ఉంది. స్టార్ హోటల్‌ని మించి ఉందని చెప్పొచ్చు. ప్రారంభంలో గార్డెనింగ్ ఉంది. పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక కింద కార్ పార్కింగ్, ఫ్రీ స్పేస్ ఉంది.
ఇక లోపలికి వెళ్లగా చాలా విశాలమైన ఓపెన్ స్పేస్ ఉంది. గెస్ట్ లు వచ్చినప్పుడు కూర్చోవడానికి, సినీ, ఇతర ప్రముఖులతో మాట్లాడటానికి చాలా పెద్ద హాల్ ఉంది. ఇవి రెండు రకాల హాల్స్ ఉన్నాయి.
దీంతోపాటు సాయంత్రం సమయంలో, మార్నింగ్ కూడా సరదాగా కూర్చొని టైమ్ స్పెండ్ చేయడానికి మంచి విశాలమైన ఓపెన్ ఏరియా ఉంది. అక్కడ నుంచి చూస్తే చాలా వరకు సిటీ కనిపిస్తుంది. బేసిక్‌గా చిరంజీవి ఇళ్లు ఉండే ప్రాంతం హైట్‌లో ఉంటుంది. దీంతో అక్కడి నుంచి చాలా సిటీ కనిపిస్తుంది.
డైనింగ్ టేబుల్ కూడా చాలా విశాలంగా ఉంది. ఒకేసారి దాదాపు పది ఇరవై మంది కూర్చొని భోజనం చేసేలా ఆ డైనింగ్ టేబుల్ ఉండటం విశేషం. అంతేకాదు వారు వాడే పాత్రలు కూడా గోల్డ్ కలర్ కోటింగ్‌లో ఉన్నాయి. రాజులు వాడే పాత్రలను తలపిస్తుంది. పూర్తిగా రాయల్ లుక్‌లో ఉన్నాయి.
మొత్తంగా చిరంజీవి హౌజ్ రాయల్ ఫ్యామిలీని తలపిస్తుందని చెప్పొచ్చు. ఈ ఇంటి విలువ ముప్పై కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఇంటికి పక్కనే మరో ఇళ్లు ఉంది చిరంజీవి. దాన్ని ఆఫీస్ లాగా వాడుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి నటుడిగా నిరూపించుకున్నారు. అద్భుతమైన సినిమాలు చేసి కమర్షియల్‌గా సక్సెస్ అయ్యారు. టాలీవుడ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా, అట్నుంచి మెగాస్టార్‌గా ఎదిగారు.
తాను కష్టపడి సంపాదించినదంతా ఆస్తులుగా మార్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. పలు వ్యాపారాల్లోనూ ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు వందల కోట్లకు ఎదిగారు చిరంజీవి. ఆయన తనయుడు రామ్ చరణ్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పెద్ద కూతురు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణంలోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్న కూతురు శ్రీజ సైతం బిజినెస్‌ని స్టార్ట్ చేశారు.
ఇప్పటికీ యంగ్ హీరోలకు మించి సినిమాల లైనప్‌తో దూసుకుపోతున్నారు. ట్రెండీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర` చేస్తున్నారు. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. గ్రాఫిక్స్ కారణంగా సినిమా డిలే అవుతుంది. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్ గారు` అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది చిరంజీవి మార్క్ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఇందులో వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నారు అనిల్. అలాగే శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు చిరంజీవి. ఇలా నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు మెగాస్టారు.