బాలయ్య కంటే ముందే అఘోరాగా చేసిన చిరు, నాగ్, వెంకీ.. మరి ఆ చిత్రాలు హిట్టా ఫట్టా?

Published : Dec 05, 2021, 10:39 AM ISTUpdated : Dec 05, 2021, 10:40 AM IST

బాలయ్య అఖండ (Akhanda) వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. అఖండ మాస్ జాతరతో థియేటర్స్ హోరెత్తిపోతున్నాయి. అఘోరాగా బాలయ్య చేసిన శివతాండవంలో తరించిపోతున్నారు ఫ్యాన్స్. బాలయ్య కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ దక్కించుకున్న చిత్రంగా అఖండ నిలిచింది.

PREV
17
బాలయ్య కంటే ముందే అఘోరాగా చేసిన చిరు, నాగ్, వెంకీ.. మరి ఆ చిత్రాలు హిట్టా ఫట్టా?

బాలయ్య అఖండ గెటప్.. పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా జనాలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ పాత్రపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. అయితే బాలయ్య (Balakrishna)కంటే ముందే సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకీ అఘోరా రోల్స్ చేయడం జరిగింది. మరి ఆ చిత్రాలు ఏమిటో, వాటి ఫలితాలు ఏమిటో చూద్దాం.. 

27

2001లో దర్శకుడు కె .రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తిరస చిత్రం శ్రీ మంజునాథ. అర్జున్, సౌందర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi)శివుడు పాత్ర చేశాడు. 

37


శివ భక్తురాలిని పెళ్లాడిని నాస్తికుడిగా అర్జున్ పాత్ర ఉంటుంది. తర్వాత అర్జున్ శివుడికి పరమ భక్తుడిగా మారిపోతాడు. ఈ మూవీలో ఓ సన్నివేశంలో చిరంజీవి అఘోరాగా కనిపించడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన శ్రీ మంజునాథ అనుకున్నంత విజయం సాధించలేదు. 

47


చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా వచ్చింది నాగవల్లి. కన్నడ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన నాగవల్లి మూవీలో నాగ భైరవ అనే పీరియాడిక్ రోల్ తో పాటు విజయ్ అనే మోడ్రన్ రోల్ చేయడం జరిగింది. 

57

శ్రీనివాస రెడ్డి డైరెక్షన్ లో సోసియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరిక్కింది ఢమరుకం మూవీ. నాగార్జున (Nagarjuna)-అనుష్క జంటగా నటించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్ శివుడు పాత్ర చేశారు. ఈ మూవీలో నాగార్జున ఓ సన్నివేశంలో అఘోరాగా కనిపించడం జరిగింది. 

67


అనుష్క హీరోయిన్ గా నటించిన నాగవల్లి భారీ క్యాస్ట్ తో తెరకెక్కింది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కొన్ని నిమిషాలు వెంకటేష్ అఘోరా గెటప్ లో కనిపించారు. నాగవల్లి మూవీలో వెంకీ భిన్న పాత్రల్లో మెప్పించారు. సినిమా ఫలితం మాత్రం డిజాస్టర్ అయ్యింది. 

77

ఇక వీరందరి కంటే ముందు కాష్మోరా చిత్రంలో పూర్తి స్థాయి అఘోరా పాత్ర చేశారు. నేను దేవుణ్ణి మూవీలో ఆర్య అఘోరా రోల్ చేశారు.  విశ్వక్ సేన్ తన నెక్స్ట్ చిత్రంలో అఘోరాగా కనిపించనున్నారు. కాగా బాలయ్య అఘోరా నేపథ్యంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. చిరు, వెంకీ, నాగ్ లకు కలిసి రాలేదు.

Also read శ్రీకాంత్‌కు అన్యాయం చేసిన బోయపాటి?

Also read రాజస్థాన్ లో అత్యంత వైభవంగా కత్రినా-విక్కీ వివాహం... అతిథుల లిస్ట్ లో కోహ్లీ, అనుష్క శర్మ

click me!

Recommended Stories