ప్రస్తుతం అనసూయ.. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ద్రాక్షాయనిగా ఆమె విభిన్నమైన లుక్ లో కనిపిస్తోంది. పాత రోజుల్లో మహిళలు ఒంటినిండా ఆభరణాలతో, పెద్ద బొట్టుతో కనిపించేవారు. అనసూయ ద్రాక్షాయని పాత్ర అలాగే కనిపిస్తోంది. ఈ చిత్రం నుంచి డిసెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ కంటే ముందుగా చిన్న టీజర్ వదిలారు. ఈ టీజర్ లో అనసూయ క్యారెక్టర్ గురించి చిన్న హింట్ వదిలారు.