Chiranjeevi:మూవీ ప్రమోషన్ ఎఫెక్ట్.. మెగా డాటర్స్ పై భయంకరమైన ట్రోల్స్.. ఎందుకో తెలుసా?

Published : Jan 17, 2026, 07:18 AM IST

Chiranjeevi: సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో చిరంజీవి కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. 

PREV
13
మన శంకర వరప్రసాద్ గారు..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరో గా నటించిన తాజా చిత్రం ‘ మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా..బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత చిరంజీవికి వచ్చిన హిట్ ఇది. అంతేకాదు.. 90ల్లో చిరంజీవిని చూసినట్లుగా ఉందని బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ బాగా సంబరాలు చేసుకుంటున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో.. చిరంజీవి లుక్స్, కాస్టూమ్స్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే.. ఇప్పుడు ఈ సినిమా అందరికీ విపరీతంగా నచ్చుతోంది.

23
విడాకులపై చిరంజీవి కామెంట్స్..

అయితే, ఈ మూవీ చూసిన వారికి కథ గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఇగో ఇష్యూస్ కారణంగా సినిమాలో శంకర వరప్రసాద్( చిరంజీవి), శశిరేఖ( నయనతార) విడాకులు తీసుకొని విడిపోతారు. కానీ, తర్వాత మళ్లీ కలిసిపోతారు. ఈ కాన్సెప్ట్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యిందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ మూవీ విజయం కావడంతో.. డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ తో కలిసి ఓ చిన్న పార్టీ చేసుకున్నారు. దీనిలో భాగంగా చిరంజీవి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

‘ఒక జంట మూడు, నాలుగు నెలలుగా విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.. అయితే... ఈ సినిమా ఇద్దరూ చూసిన తర్వాత వారి అభిప్రాయం మార్చుకున్నారు.. మళ్లీ కలిసిపోయారు. మూవీలో తల్లి క్యారెక్టర్ చెప్పిన మాటలు వారికి బాగా కనెక్ట్ అయ్యాయి...’ చిరంజీవి చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వగా.. ఆ వీడియోని పట్టుకొని మెగా డాటర్స్ ని ట్రోల్ చేస్తుండటం విశేషం.

33
మీ ఇంట్లో వాళ్లకు సినిమా చూపించండి సర్ అంటూ ట్రోల్స్...

చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ గతంలో ప్రేమించి, ఇంట్లో పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తె పుట్టిన తర్వాత.. భర్తతో విడిపోయి పుట్టింటికి చేరింది. కొన్ని సంవత్సరాల తర్వాత.. మళ్లీ.. కుటుంబ సభ్యులు అందరూ కలిసి శ్రీజకు రెండో పెళ్లి చేశారు. ఈ జంటకు కూడా ఒక కుమార్తె పుట్టింది. పాప పుట్టిన తర్వాత.. మనస్పర్థలు వచ్చి అతనితో కూడా విడిపోయింది. ఇక.. చిరంజీవి తమ్ముడు నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేశారు. కానీ, ఈ జంట కూడా విడాకులు తీసుకొని విడిపోయింది. దీంతో.. చిరంజీవి చెప్పిన మాటలను వీళ్లిద్దరికీ కనెక్ట్ చేసి మరీ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ సినిమాని.. చిరంజీవి తమ కుటుంబంలో ఆడపిల్లలకు చూపించాలని.. అప్పుడు విడాకులు తీసుకోరు అంటూ పోస్టులు పెడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories