Balakrishna: టాలీవుడ్ నటుడు ఛత్రపతి శేఖర్ అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణతో జరిగిన ఓ సంఘటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బాలయ్య తనను గుర్తుపట్టనట్లు ప్రవర్తించడంతో నిరాశ చెందానని శేఖర్ తెలిపాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ నటుడు ఛత్రపతి శేఖర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నాడు. బాలయ్యతో కలిసి లెజెండ్, విజయేంద్ర వర్మ, జై సింహా, అఖండ లాంటి చిత్రాలలో నటించాడు ఛత్రపతి శేఖర్.
25
అఖండ షూటింగ్‌లో ఓ సంఘటన..
అఖండ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో జరిగిన ఓ సంఘటనను ఛత్రపతి శేఖర్ గుర్తు చేసుకున్నాడు. షూటింగ్ జరుగుతున్నప్పుడు.. బాలకృష్ణ దూరం నుంచి పద్యాలు వింటుండగా.. శేఖర్ ఆయనను పలకరించడానికి వెళ్లాడట. అయితే అక్కడి సిబ్బంది బాలయ్యను డిస్టర్బ్ చేయొద్దున్నారట.
35
నిరాశగా వెనుదిరిగాడు..
బాలయ్య పద్యాలు వినడం పూర్తయిన తర్వాత శేఖర్ ఆయన దగ్గరకు వెళ్లాడట. బాలయ్య దగ్గరకు వెళ్లి పలకరించగా.. ఆయన ఎవరో తెలియనట్టు 'ఎవరు'.? అని అడిగారట. దానికి శేఖర్ చిన్నబుచ్చుకున్నాడు. శేఖర్ తన విగ్గు సరిచేసుకుంటూ కాస్త నిరాశలో ఉండగా, బాలకృష్ణ స్వయంగా అతడి వద్దకు వచ్చి గడ్డం, విగ్గు సరిచేసి వెళ్ళిపోయారట. దీంతో శేఖర్ కాస్త రిలీఫ్ అయ్యాడట.
'జై సింహా' సమయంలో బాలకృష్ణ.. శేఖర్‌ను పేరు పెట్టి పిలిచేవారట. జై సింహా చిత్రంలో బాలకృష్ణ స్నేహితుడిగా నటించినప్పుడు, బాలకృష్ణ తనను పేరు పెట్టి "ఏమి శేఖరా. ఎటు పోతున్నావ్ సిగరెట్ తాగడానికి?" అని పలకరించేవారని గుర్తుచేసుకున్నాడు.
55
ఐ టూ ఐ కాంటాక్ట్ లేకపోవడం..
ఐ-టూ-ఐ కాంటాక్ట్ లేకపోవడం వల్లనే అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య తనను గుర్తుపట్టలేదని గ్రహించానని ఛత్రపతి శేఖర్ అనుకున్నాడట. నిరాశ చెందకుండా అప్పుడు ఆలోచించానని చెప్పుకొచ్చాడు.