గత కొద్ది కాలంగా జరుగుతున్న అనసూయ వివాదం కీలక మలుపు తీసుకుంది. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ 42 మందిపై స్టార్ నటి కేసులు పెట్టింది. పరువునష్టం, లైంగిక వేధింపులతో పాటు క్రిమినల్ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రముఖ సినీ, టీవీ నటి అనసూయ భరద్వాజ్ తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది. పరువునష్టం, లైంగిక వేధింపులతో పాటు క్రిమినల్ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అసభ్యకరమైన, మార్ఫింగ్ చేసి, ఆ ఫోటోలు, వీడియోలను కావాలనే సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె పిర్యాదుపై వారు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురు వ్యక్తులు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను నిందితులుగా చేర్చారు.
25
గౌరవప్రదంగా స్పందించాను తప్పా..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అనసూయ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో జనవరి 12, 2026న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, డిసెంబర్ 22, 2025న ఒక పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఒక తెలుగు నటుడు( శివాజీ) మహిళల దుస్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయని పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు, డిసెంబర్ 23న, ఒక మాల్ ఒపెనింగ్ కు వెళ్లిన సమయంలో మీడియా ప్రతినిధులు ఈ వివాదంపై తన అభిప్రాయం అడిగారని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సపోర్ట్ గా తాను గౌరవప్రదంగా స్పందించానని, అనసూయ అన్నారు.
35
అన్ని రకాలుగా పరువుతీస్తున్నారు..
అయితే, డిసెంబర్ 24న ఆ నటుడు ప్రెస్ మీట్ నిర్వహించి తన పేరు ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలపై మాట్లాడారని అనసూయ ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని టీవీ ఛానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు, ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్లు ఈ అంశాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసారం చేసి, తనను లక్ష్యంగా చేసుకుని వివాదాన్ని మరింత పెంచారని ఆమె పేర్కొన్నారు. అప్పటి నుంచి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సైట్స్ లో తనపై పెద్ద ఎత్తున దాడి మొదలైందని అనసూయ ఫిర్యాదులో తెలిపారు. టీవీ చర్చలు, యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, లైవ్ స్ట్రీమ్స్ ..కామెంట్ సెక్షన్లలో అసభ్య పదజాలంతో తనను దూషించారని పేర్కొన్నారు.
లైంగికంగా కించపరిచే వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే పోస్టులు తన గౌరవానికి, వృత్తికి, పబ్లిక్ ఇమేజ్‌కు భంగం కలిగించాయని వివరించారు. అంతే కాదు మాటలతో మాత్రమే కాకుండా.. ఏఐ తో ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి.. తనను కించపరిచేలా.. ఆన్ లైన్ లో వైరల్ చేస్తున్నారని. యూట్యూబ్ ఛానెళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని లైంగికంగా కించపరుస్తూ క్రిమినల్ బెదిరింపులకు పాల్పడ్డారని..ఈ చర్యల వల్ల తాను, తన కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి, భయానికి గురయ్యామని కంప్లైంట్ లో ఆమె పేర్కొన్నారు. .
55
42 మంది సెలబ్రిటీలపై అనసూయ కేసు..
ఈ కేసులో మొత్తం 42 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో నటి కరాటే కల్యాణి, టీవీ యాంకర్ రోహిత్, న్యూస్ నెట్‌వర్క్ యాంకర్ మనోజ్, మరోక యాంకర్ బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి గొగినేని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పావని, ఆర్టిస్ట్ శేఖర్ బాషా , అడ్వకేట్ రజని, తదితరులు ఉన్నారు. పలువురు గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు దశలో ఉందని అధికారులు వెల్లడించారు.