రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు

Published : Jan 25, 2026, 11:17 PM IST

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ తన కుమార్తె సుస్మిత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ కోసం సుస్మిత సొంతంగా అప్పు తెచ్చి మరీ డబ్బు పెట్టారట. 

PREV
15
మన శంకర వరప్రసాద్ గారు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సెలెబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్ర గ్రాండ్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేస్తూ ఆదివారం రోజు మన శంకర వరప్రసాద్ గారు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సెలెబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు.

25
అతిథులు వీరే 

ఈ ఈవెంట్ కి మన శంకర వరప్రసాద్ గారు చిత్ర యూనిట్ తో పాటు కొందరు అతిథులుగా కూడా హాజరయ్యారు. గెస్ట్ రోల్ లో నటించిన విక్టరీ వెంకటేష్ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్ కి లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు, వివి వినాయక్, దిల్ రాజు అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ అనిల్ రావిపూడిని అభినందించారు. అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. 

35
విజయం ఇచ్చే ఉత్సాహం వేరు 

ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత సుస్మిత నాకు ఫస్ట్ చెప్పింది. సినిమా విజయం సాధించడంతో చాలా సంతోషంగా అనిపించింది. సుస్మిత చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పింది.  డాడీ ఎలాంటి రియాక్షన్ లేదు.. బహుశా మీకు ఇలాంటి సక్సెస్ కొత్త కాదు కదా. నాకు మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంది అని చెప్పింది. ఇలా రా అమ్మా అని పిలిచా. ఈ రోజు అన్నం తిన్నాం కదా అని రేపు ఉండం. మంచి కూరలతో రేపు తినే భోజనం కూడా రుచిగానే ఉంటుంది. సక్సెస్ కూడా అంతే. ఎప్పుడూ బోర్ కొట్టదు. విజయం ఇచ్చే ఉత్సాహం వేరుగా ఉంటుంది అని చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. 

45
రాఘవేంద్ర రావు గారి మాట నిజమైంది 

ఎగ్జిక్యూటివ్స్ కి బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మా చేతుల మీద షీల్డ్స్ ఇవ్వడం చూస్తుంటే వింటేజ్  చిరంజీవినే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ కూడా తీసుకొచ్చిన క్రియేటివ్ అనిల్ దే. నిజంగా ఇది నాకు ఒక నాస్టాలజీ ఫీలింగ్. అనిల్ వర్కింగ్ వర్కింగ్ స్టైల్ చూస్తే నాకు రాఘవేంద్రరావు గారు గుర్తు వస్తారు. ఆయనే నాకు అనిల్ ని పరిచయం చేశారు మేము కలిసి పని చేస్తే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన నమ్మకం నిజమైంది.

55
రాంచరణ్ కోసం సుస్మిత ఒంటరిగా వీధుల్లో తిరిగింది 

తన కుమార్తె సుస్మిత గురించి మాట్లాడుతూ చిరంజీవి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. సుస్మిత ఇండస్ట్రీ లోకి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ తో చెప్పింది. చరణ్ సుస్మితని వెల్కం చేసాడు. రంగస్థలంలో తన కాస్ట్యుమ్స్ ను చూసుకుంది. ఆ సినిమాకి ఒక లుంగీ కావాలంటే రాజమండ్రి వీధుల్లో తనే స్వయంగా తిరిగింది. ఒక్క లుంగీ కోసం రాజమండ్రి వీధుల్లో ఒంటరిగా తిరగడానికి కూడా సుస్మిత వెనకడుగు వేయలేదు. ఈ ఇండస్ట్రీ అద్దం లాంటిది మనం ఎలా ఉంటే దాని రిసల్ట్ కూడా అలానే ఉంటుంది. తను నిర్మాత అవ్వాలనుకున్నప్పుడు వెబ్ సిరీస్ లో మొదలు పెట్టింది. అక్కడ అనుభవాన్ని సంపాదించింది. ప్రతి డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుంది. తర్వాత చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసింది. నిజానికి తను అనుకుంటే మా ఫ్యామిలీలో ఎవరో ఒక హీరోతో సినిమా చేయొచ్చు. కానీ తను అలా అనుకోలేదు. ఈ సినిమా కోసం సాహూతో కలిసి తనే సొంతగా ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా కోసం నేను నయా పైసా ఇవ్వలేదు. అప్పు అవసరం అయితే తానే అప్పు తెచ్చుకుంది. నాకు కావాల్సిన రెమ్యునరేషన్ సమయానికి తగ్గట్టుగా ఆ ఇద్దరి నుంచి తీసుకున్నాను. అంత ప్రొఫెషనల్గా తన ప్రవర్తించింది.  తను ఈరోజు ఈ విజయాన్ని ఆస్వాదిస్తుంది. ఒక ఫాదర్ గా  సుస్మిత ను చూసి నేను గర్వపడుతున్నాను అని చిరంజీవి అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories