Padma Awards: రాజేంద్ర ప్రసాద్, మురళి మోహన్ లకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. దశాబ్దాలుగా వీరు తెలుగు చిత్ర పరిశ్రమలో నటులుగా రాణిస్తున్నారు.
భారత ప్రభుత్వం పద్మ అవార్డులని ప్రకటించింది. వివిధ రంగాలలో రాణించిన వారికి పద్మ అవార్డులు అనౌన్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దీనితో తెలుగు సినీ అభిమానులు, ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
25
మురళి మోహన్ కి దక్కిన గౌరవం
మురళి మోహన్ తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. తెలుగు సినిమాలో ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం మురళి మోహన్ కి పద్మ అవార్డు ప్రకటించింది. మురళి మోహన్ రాజకీయాల్లో కూడా రాణించారు. మురళి మోహన్ తో పాటు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కి కూడా పద్మ శ్రీ అవార్డు దక్కింది.
35
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మ శ్రీ
రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ కి కూడా పద్మశ్రీ దక్కింది. గతంలో పద్మ అవార్డుల గురించి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్ట్ లకు కూడా పద్మ అవార్డులు వస్తున్నాయి.. మీకు ఎందుకు రావడం లేదు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. పద్మ అవార్డుల కోసం నేనెప్పుడూ ప్రయత్నించలేదు.
రామోజీరావు గారు ఒకసారి నన్ను అడిగారు. రాజేంద్ర ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అడిగారు. లేదు అని చెప్పా. ఎప్పుడూ ట్రై చేయకు. ఎందుకంటే పద్మశ్రీ కంటే నువ్వు గొప్పవాడిని అని అన్నారు. పద్మ అవార్డు కోసం నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. రాలేదని కూడా బాధపడలేదు అని రాజేంద్ర ప్రసాద్ గతంలో అన్నారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.
55
కామెడీ సినిమాలు
మొత్తంగా రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య మాస్ సినిమాలతో క్రేజ్ సొంతం చేసుకుంటే.. వారికీ భిన్నంగా రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలతో రారాజులా వెలిగారు.