ఓ రకంగా ఇది రాజశేఖర్‌కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ మూవీ ఆయనే చేసి ఉంటే మరో స్థాయిలో ఉండేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన కెరీర్ కూడా వేరేలా ఉండేది. దీంతోపాటు మరో సినిమా విషయంలో కూడా అదే జరిగింది. చిరంజీవి చేసిన `ఆరాధన` కూడా మొదట ఆయన్నే అప్రోచ్ అయ్యారు. కానీ రాజశేఖర్ నో చెప్పాడట.
అయితే లీడ్ రోల్ పులిరాజుగా రాజశేఖర్‌ని అడిగారు. ఆయన చేయనన్నారు. కానీ మరో పాత్రలో రాజశేఖర్ కనిపించారు. రాజశేఖర్ కాదనడంతో పులిరాజు పాత్రకి చిరంజీవి ఓకే చెప్పారు. ఈ మూవీ చిరంజీవికి నటుడిగా మరో పది మెట్లు ఎక్కించింది.
క్రిటికల్‌గా మెప్పించిన మూవీ ఇది. ఇది కూడా తమిళ రీమేక్. ఇలా ఈ రెండు సినిమాల విషయంలో రాజశేఖర్ చేసిన మిస్టేక్ ఆయన కెరీర్‌పై గట్టి ప్రభావాన్నే చూపించాయని చెప్పొచ్చు.
read more: జయసుధ విషయంలో విసిగిపోయిన ఎన్టీఆర్, సీరియస్ వార్నింగ్.. దెబ్బకి మళ్లీ ఆ మాట ఎత్తలేదు
also read: కృతి సనన్ డ్రెస్ పై ట్రోల్స్, `అది వేసుకోవడం మర్చిపోయిందా?`.. ఐఫాలో ఆమె లుక్‌పై క్రేజీ సెటైర్లు