
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సీనియర్ హీరోల్లో టాప్ లో ఉన్నారు. గత నలభై ఏళ్లుగా సేమ్ అదే ఇమేజ్, అదే క్రేజ్‌తో రాణిస్తున్నారు. ఇప్పటికీ తిరుగులేని మెగాస్టార్‌గా నిలిచారు. ఆయన వారసత్వాన్ని చాలా మంది పంచుకుంటున్నారు. అటు పవన్ కళ్యాణ్, ఇటు రామ్ చరణ్, తన అల్లుళ్లు కొనసాగిస్తున్నారు. ఆయన ఫ్యామిలీ మొత్తం సినిమాల్లో ఉన్న విషయం తెలిసిందే.
ఇక చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. స్వతహాగా హీరోగా రాణించారు, నిలబడ్డారు, స్టార్ గా ఎదిగారు. ఆయన నాన్న కొణిదెల వెంకటరావు, అడపాదడపా నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన పోలీస్ కానిస్టేబుల్.
అయితే సినిమాల్లో రాణించాలని ఆయనకు ఉండేదట. కానీ అది సాధ్యం కాలేదు. చిరంజీవిని ప్రోత్సహించారు. ఆయన సక్సెస్ అయ్యారు. చిరు స్టార్ స్టేటస్‌ని దగ్గరుంచి చూశాడు వెంకట్రావు. అంతేకాదు మనవడిని కూడా సినిమాల్లో చూశాడట.
రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో కూడా వెంకట్రావు బాగానే ఉన్నారు. వెండితెరపై చరణ్‌ని కూడా చూశాడట. అయితే తాతకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు చరణ్. ఆయన చివరగా చూసిన మూవీ తనదే అని చెప్పారు.
రామ్ చరణ్ నటించిన `చిరుత` సినిమాని థియేటర్లో చూశాడట. ఆ తర్వాత ఆయన మూవీస్ చూడలేదు. వీల్ చైర్‌లో ఉన్నప్పుడు మనవడిని వెండితెరపై చూసి మురిసిపోయాడట వెంకట్రావు.
అయితే ఇప్పుడు నాన్నమ్మ(అంజనాదేవి) తనకు సంబంధించిన అన్ని సినిమాలు చూస్తుంది. అదే సమయంలో మరో అదృష్టం కూడా ఆమెకి, తమకి దక్కిందన్నారు. `ఆచార్య` సినిమాలో ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఒకే మూవీలో కొడుకుని, మనవడిని చూసే అవకాశం నానమ్మకి దక్కిందని చెప్పాడు.
అయితే నాన్నమ్మకి పోటీ ఉంటుంది, అమ్మ సురేఖని ఆటపట్టిస్తుందని చెప్పారు. ఏం సురేఖ మా వాడు(చిరంజీవి) చూడు ఎలా చేశాడో అని గొప్పలు చెబుతుందట. అలాంటి చిలిపి పనులు చేస్తుందన్నారు, ఈ మూవీని నాన్న, నాన్నమ్మ, అమ్మ, నేను కలిసి చూస్తే మజా ఉంటుందని చెప్పారు.
ఇది `ఆచార్య` రిలీజ్ టైమ్ చెప్పిన విషయం. అంటే ఇప్పటికే అది అయిపోయింది. అయితే నాన్నమ్మలో ఉన్న చిలిపితనాన్ని చరణ్ బయటపెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.
ఇదిలా ఉంటే ఇటీవల అంజనాదేవి అనారోగ్యానికి గురైందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చిరంజీవి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం `ఆర్‌సీ16` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దీనికి `పెద్ది` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ఇది క్రికెట్, రెజ్లింగ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందని, ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే మూవీ అని తెలుస్తుంది.
ఇందులో చరణ్ గుడ్డివాడిగా కనిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దవలో ఉంది. ఇటీవలే హైదరాబాద్‌లో షూట్ జరిగిందని, నెక్ట్స్ ఢిల్లీలో షూటింగ్ చేయబోతున్నారని సమాచారం.
read more: `హిట్ 3` టీజర్ రివ్యూః నాని అసలు రూపం ఇదేనా? ఆ సినిమాలను ఫాలో అయితే లాభం లేదు, లింక్ ఉండాలి
also read: Bigg Boss Telugu 9: గత సీజన్ దెబ్బకి కీలక మార్పులు, ఈ సారి వారికే ప్రయారిటీ ?