దీంతో ఈ సారి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చాలా కీలక మార్పులు చేశారట. ఈ సారి కామన్ మ్యాన్ అనే ఎలిమెంట్ ఉండబోదట. చాలా వరకు పాపులర్ ఆర్టిస్ట్, సెలబ్రిటీలకే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారట.
అలాగే పెద్ద ఏజ్ వాళ్లని కూడా తీసుకోకూడదని అనుకుంటున్నారట. సీనియర్లు, ఏజ్ పెద్ద వాళ్లు వచ్చి హౌజ్లో ముచ్చట్లు తప్ప మరేం చేయడం లేదు, కంటెంట్ ఇవ్వడం లేదు. దీంతో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలను చూస్తున్నారట.
దీనికితోడు ఎంటర్టైన్ చేసే సెలబ్రిటీలను చూస్తున్నారట. లవ్ ట్రాక్, రొమాంటిక్ విసయాలకు ప్రయారిటీ ఇస్తున్నారట. యూత్ ని ఆకట్టుకునేలా లవ్ ట్రాక్ లు నడిపించాలని, అలాంటి కంటెస్టెంట్లకి మొదటి ప్రాధాన్యత అని, గొడవలు పెట్టుకునే వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని, కంటెంట్ క్రియేట్ చేయగలిగే వారిని చూస్తున్నారట.