`హిట్‌ 3` టీజర్‌ రివ్యూః నాని అసలు రూపం ఇదేనా? ఆ సినిమాలను ఫాలో అయితే లాభం లేదు, లింక్‌ ఉండాలి

Published : Feb 24, 2025, 05:12 PM IST

Hit3 Teaser: నాని హీరోగా నటిస్తున్న `హిట్‌ 3` మూవీ టీజర్‌ వచ్చింది. ఇందులో నాని తన రియాలిటీ చూపించారు. ఇన్నాళ్లు జనం మోసపోయారని తెలిపి షాకిచ్చారు.   

PREV
16
`హిట్‌ 3` టీజర్‌ రివ్యూః నాని అసలు రూపం ఇదేనా? ఆ సినిమాలను ఫాలో అయితే లాభం లేదు, లింక్‌ ఉండాలి
Hit 3 Teaser:

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `హిట్‌ 3`. ఇది హిట్‌ ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న మూవీ, శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే `హిట్‌` మొదటి సినిమాలో విశ్వక్‌సేన్‌ హీరోగా నటించారు. `హిట్‌ 2`లో అడవిశేషు నటించాడు.

ఆ సమయంలోనే మూడో ఫ్రాంఛైజీలో నాని నటించబోతున్నట్టు ప్రకటించారు. సినిమా చివర్లో గ్లింప్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు `హిట్‌ 3` టైమ్‌ వచ్చింది. మూడో కేస్‌ ప్రధానంగా ఇది సాగబోతుంది. 
 

26

ఇటీవల కాలంలో క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓ సీరియల్‌ కిల్లర్‌ని పట్టుకునేందుకు సాగే ఇన్వెస్టిగేషనే ఈ సినిమా కథాంశం. ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది కనిపెట్టడమే మెయిన్‌ స్టోరీ. గత రెండు చిత్రాలు మంచి ఆదరణ పొందాయి.

ఇప్పుడు మూడో సినిమా కూడా అంతే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. ఇందులో నాని నటిస్తుండటంతో సినిమా రేంజ్‌ పెరిగిపోయింది. తాజాగా `హిట్‌ 3` టీజర్‌ వచ్చింది. 
 

36

నాని అంటే క్లాస్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చే సినిమాలు చేస్తారనే ఇమేజ్‌ ఉంది. లవ్‌ స్టోరీస్‌తో ఆకట్టుకున్నాడు. మిడిల్‌ క్లాస్‌ సమస్యలు చెప్పి మెప్పించాడు. ఆయన యాక్షన్‌ కూడా `దసరా`, `సరిపోదా శనివారం` చిత్రాల్లో చూపించారు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఊచకోత చూపించాడు. కాదు కాదు దాన్ని మించి చూపిస్తున్నాడు.

ఇన్నాళ్లు `ఫస్ట్ నిన్ను చూసినప్పుడే డౌట్‌ వచ్చింది. ఒక పోలీస్‌ ఆఫీసర్‌ వేనా నువ్వు` అని ఓ లేడీ ప్రశ్నించగా, అదే అనుకుని మోసపోయారు ఇన్నాళ్లు జనం. కానీ మీకు చూపిస్తా ఒరిజినల్‌` అంటూ నాని చెప్పే డైలాగ్‌ని, ఆ తర్వాత యాక్షన్‌ సీన్లని చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయమనిపిస్తుంది. 
 

46

ఈ టీజర్‌ ద్వారా, ఈ సినిమా ద్వారా నాని తానేంటో చూపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో తాను ఇకపై ఎలా కనిపించబోతున్నారో చెప్పే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. ఇక టీజర్‌లో ప్రారంభంలో ఓ సీరియల్‌ కేసులను సాల్వ్ చేయడానికి సరైన ఆఫీసర్‌ కావాల్సి ఉంది. దీనికి కానిస్టేబుల్‌.. అర్జున్‌ సర్కార్‌(నాని) పేరుని రికమండ్‌ చేస్తాడు.

అప్పటికే నాని బార్డర్‌లో, ఇతర స్టేట్స్ లో క్రిమినల్స్ ని పట్టుకుని ఉతికి ఆరేస్తుంటాడు. దీంతో పెద్ద ఆఫీసర్‌(రావు రమేష్‌) ఆయనకు ఈ కేసు అప్పగించడానికి నాకు ప్రాబ్లమ్‌ లేదుగానీ, ఆయన లాఠీకి దొరికిన వాడి పరిస్థితే ఊహించుకుంటేనే భయమేస్తుందని చెప్పడంతో నాని పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిపారు. 

56

దీంతో నాని ఒక పోలీస్‌ ఆఫీసర్‌గా నేరస్తులను, లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌ చేయడానికి ఆయన ఎంతగా ఫైర్‌ అయ్యాడో, దొరికిన వారిని దొరికినట్టు ఎలా కొడుతున్నాడో చూపించారు. అనంతరం క్రైమ్‌ సీన్లని చూపిస్తూ, `

అందరు ఒకే మెథడ్‌`లో మర్దర్‌ చేస్తున్నారంటే ఏదో మోటివ్‌ ఉందని నాని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఖైదీని టేబుల్‌పై చేతులు పెట్టించి కొట్టడం నాని అగ్రెషన్‌ని, ఆయన నిజాన్ని రాబట్టడం కోసం చేసే చర్యలను తెలియజేస్తుంది. 
 

66

అనంతరం నాని పాత్రలోని రాక్షసత్వాన్ని చూపించారు. ఇందులో `మార్కో`, `యానిమల్‌` తరహాలో యాక్షన్‌ హింట్‌ ఇచ్చారు. ఓ వ్యక్తిని నిలువునా రెండు ముక్కలు చేయడం షాకిస్తుంది. వామ్మో నాని అనేలా చేస్తుంది. టీజర్‌ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.

మరి ఇటీవల యాక్షన్‌ సినిమాలు శృతి మించుతున్నాయి. ఎంత వాయిలెన్స్ ఉంటే అంత హిట్‌ అనే పరిస్థితి నెలకొంటుంది. మరి కేవలం యాక్షన్‌ ఉంటే సరిపోదు, కంటెంట్‌ కూడా ఉండాలి. దానికి లింక్‌ అయి ఉండాలి.

అప్పుడే ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. లేదంటే విమర్శలు తప్పవు. చేదు అనుభవం తప్పది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. నాని తన వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై దీన్ని నిర్మిస్తున్నారు. మే 1న సినిమా విడుదల కానుంది. 

read more: Nani:జీరో నుంచి ఎదిగిన నాని రెమ్యునరేషన్, ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

also read: Bigg Boss Telugu 9: గత సీజన్‌ దెబ్బకి కీలక మార్పులు, ఈ సారి వారికే ప్రయారిటీ ?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories