సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఒక రకంగా చెప్పాలంటే, అర్జున్ రెడ్డి, గీత గోవిందం తరువాత ఆరేంజ్ లో విజయ్ కు సక్సెస్ లభించలేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విజయ్ కు కలిసిరావడంలేదు. పాన్ ఇండియా ఇమేజ్ కోసం లైగర్ సినిమాతో భారీ అంచనాలతో వచ్చి బోల్తా పడ్డాడు రౌడీ హీరో. ఆతరువాత మాస్ ఇమేజ్ కలిసిరావడం లేదు అని క్లాస్ కు షిప్ట్ అయ్యాడు. గీత గోవిందం టైప్ లోనే ఫ్యామిలీ స్టార్, ఖుషి సినిమాలు చేశాడు. కాని ఆ రెండు సినిమాల యావరేజ్ గానే మిగిలిపోయాయి. ఖుషి సినిమా మాత్రం కాస్త పర్వాలేదు అనిపించింది. కానీ విజయ్ దేవరకొండ ఇమేజ్ కు తగ్గ హిట్ మాత్రం లభించలేదు. దాంతో డిఫరెంట్ జానర్స్ ను ట్రై చేసుకుంటూ వెళ్తున్నాడు రౌడీ హీరో.