
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాల్గో మూవీగా `అఖండ 2` రూపొందింది. గతంలో `సింహం`, `లెజెండ్`, `అఖండ` చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవి పెద్ద హిట్ అయ్యాయి. పదేళ్లలో బాలయ్యకి మూడు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను అనే చెప్పాలి. అందుకే వీరి కాంబోలో వస్తోన్న నాల్గో సినిమా `అఖండ 2 తాండవం`పై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. సంయుక్త హీరోయిన్‌గా చేసింది. పూర్ణ, హర్షాలి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 5న విడుదల కాబోతుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. శివతత్వానికి సంబంధించిన కథాంశంతో రూపొందిన మూవీ కావడంతో దీన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు.
`అఖండ 2` ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని యు /ఏ సర్టిఫికేట్‌ని పొందింది. ఇది రెండు గంటల 44 నిమిషాలు నిడివి ఉండబోతుందట. ఇటీవల పెద్ద హీరోల సినిమాల నిడివి మూడు గంటలు దాటుతున్న నేపథ్యంలో ఈ సినిమా నిడివి చాలా డీసెంట్‌గానే ఉందని చెప్పొచ్చు. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరోవైపు టీమ్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇందులో కొన్ని ఎపిసోడ్లు హైలైట్‌గా ఉంటాయని, అవే సినిమాకి బ్యాక్ బోన్ అంటున్నారు. హీరో ఎంట్రీ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫ్యామిలీ ఎమోషన్ సీన్లు, క్లైమాక్స్, ముఖ్యంగా ఆకాశంలో హనుమంతుడు కనిపించే సీన్ అదిరిపోతుందంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా కనిపిస్తారని సమాచారం. దీంతో ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఈ క్రమంలో `అఖండ2`లో నటించిన ఆర్టిస్ట్ ల పారితోషిక వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఈ చిత్రానికి బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారని అంటున్నారు. ఆయనకు ఏకంగా రూ.40కోట్ల పారితోషికం ఇచ్చారట. గత చిత్రాలతో పోల్చితే డబుల్ చేసినట్టు సమాచారం. అలాగే దర్శకుడు బోయపాటికి రూ.35కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. వీరితోపాటు హీరోయిన్ సంయుక్తకి రెండు కోట్ల వరకు ఇచ్చారని, కీలక పాత్రల్లో నటించిన హర్షాలి, పూర్ణలకు యాభై లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఆదిపినిశెట్టికి కోటి రూపాయలు ఇచ్చారట. థమన్ పారితోషికం రూ.15-20కోట్ల మధ్య ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మరో షాకింగ్ పారితోషికం వినిపిస్తోంది. బాలయ్య రూ.72కోట్లు తీసుకున్నారని, బోయపాటి రూ.45కోట్లు తీసుకున్నట్టు కొన్ని ఆన్ లైన్ మీడియాసంస్థలు చెబుతున్నాయి. కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉంది.
ఇక `అఖండ 2` బడ్జెట్ వివరాలు చూస్తే, ఈ సినిమాకి రెండు వందల కోట్ల పారితోషికం అయ్యిందట. కాకపోతే బిజినెస్ గట్టిగానే జరిగిందంటున్నారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందట. అందుకు గానూ రూ.85కోట్లు చెల్లించినట్టు సమాచారం. అన్ని భాషలు కలిపి శాటిలైట్ రైట్స్ రూ.60కోట్లు అని టాక్. థియేట్రికల్ రైట్స్ చూస్తే రూ.115కోట్లు అని సమాచారం. తెలుగు స్టేట్స్ లో రూ.88కోట్లు, ఓవర్సీస్ రూ.15కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.11కోట్లు అని సమాచారం. ఇందులోనూ నైజాంలో రూ.23.50కోట్లు, సీడెడ్లో రూ.22 కోట్లు, ఉత్తర ఆంధ్రలో రూ.11.50కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.7.50కోట్లు, వెస్ట్ గోదావరి రూ.5.50కోట్లు, గుంటూరు రూ.8.50కోట్లు, కృష్ణ రూ.5.75, నెల్లూర్ రూ.4 కోట్లకి అమ్ముడు పోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ లెక్కన `అఖండ 2` రిలీజ్‌కి ముందే సేఫ్‌లోకి వచ్చింది. ఎందుకంటే ఈ చిత్రానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి దాదాపు రూ.260కోట్ల వరకు వచ్చింది. సినిమాకి పెట్టిన ఖర్చు సుమారు రూ.200కోట్లు. నిర్మాతలు రిలీజ్‌కి ముందే సేఫ్‌గా ఉన్నారు. కానీ ఇంతటి భారీ రికవరీ బాలయ్య మూవీకి సాధ్యమేనా అనేది పెద్ద డౌట్. ఎందుకంటే ఆయన గత చిత్రాల్లో ఏదీ రెండు వందల కోట్ల వసూళ్లని దాటలేదు. ఇప్పుడు `అఖండ 2` బ్రేక్ ఈవెన్ కావాలంటే రెండు వందల 50 కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాలి. అది పాజిబుల్ అవుతుందా? అనే సందేహం కలుగుతుంది. బాలకృష్ణ మీద ఇది పెద్ద రిస్కే అంటున్నారు. కాకపోతే కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నారు. ఈ మధ్య కాలంలో దేవుడి రిలేటెడ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలు బాగా ఆడుతున్నాయి. అందులో భాగంగానే `అఖండ 2` కూడా దుమ్ములేపుతుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.