ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ కాదు.. చిరంజీవి గుండెల నిండా అభిమానం పెంచుకున్నది ఆ లెజెండ్రీ నటుడిపైనే

Published : Jun 19, 2025, 04:59 PM IST

చిరంజీవి తాను అభిమానించే, ఆరాధించే నటుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంతకీ చిరంజీవి అభిమానించే ఆ లెజెండ్ ఎవరో ఇప్పుడు తెలుసుకోండి. 

PREV
16
ఎన్టీఆర్, కృష్ణతో చిరంజీవి నటించిన చిత్రాలు

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి లెజెండ్రీ హీరోలతో కలిసి నటించారు. వారి కెరీర్ ముగుస్తున్న టైంలో చిరంజీవి టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగారు. దీంతో టాలీవుడ్ లో చిరంజీవి హవా మొదలైంది. కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు.

చిరంజీవి ఎన్టీఆర్ తో తిరుగులేని మనిషి చిత్రంలో నటించారు. కృష్ణతో కొత్త అల్లుడు, తోడు దొంగలు లాంటి చిత్రాల్లో నటించారు. స్టార్ హీరో అయ్యాక మెకానిక్ అల్లుడు చిత్రంలో ఏఎన్నార్ తో నటించారు.

26
చిరంజీవి అభిమాన నటుడు ఎవరో తెలుసా ?

కానీ వీళ్ళెవరూ తాను నటుడిని కావాలనే కోరిక కలగడానికి కారణం కాలేదట. తాను అభిమానించే, ఆరాధించే నటుడు వేరొకరు ఉన్నారు. ఇదే ప్రశ్నని మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని అడిగింది. మీకు ఎన్టీఆర్, ఏఎన్నార్ లలో అభిమాన నటుడు ఎవరు అని మంచు లక్ష్మి ప్రశ్నించింది. దీంతో చిరంజీవి సెకను కూడా ఆలోచించకుండా వీళ్ళిద్దరూ కాదు.. నా అభిమాన నటుడు ఎస్వీ రంగారావు అని సమాధానం ఇచ్చారు. దీంతో మంచు లక్ష్మి వావ్ అని రియాక్షన్ ఇచ్చింది.

గతంలో చిరంజీవి ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా చిరంజీవి ఎస్వీ రంగారావు గురించి మాట్లాడుతూ.. నాకు సినిమా నటుడిని కావాలనే కోరిక కలిగింది ఎస్వీ రంగారావు గారిని చూసే అని చిరంజీవి తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరితో చిరంజీవికి నటించే అవకాశం దక్కింది. కానీ ఎస్వీఆర్ తో నటించే ఛాన్స్ రాలేదు. ఎందుకంటే చిరంజీవి సినీ రంగంలోకి అడుగుపెట్టే సమయానికే ఎస్వీఆర్ మరణించారు.

36
ఎస్వీ రంగారావుతో నటించిన చిరంజీవి తండ్రి 

ఎస్వీఆర్ తో నటించే ఛాన్స్ నాకు రాలేదు కానీ మా నాన్నకి ఆ అవకాశం దక్కింది అని చిరంజీవి తెలిపారు. తాను స్కూల్లో చదువుతున్న సమయంలో మా నాన్న ఎస్వీఆర్ తో కలిసి జగత్ కిలాడీలు అనే చిత్రంలో నటించారు. ఆయనది చిన్న పాత్రే అయినప్పటికీ ఎస్వీఆర్ గురించి ఇంటికి వచ్చి అనేక విషయాలు చెప్పేవారు. ఎస్వీఆర్ నటన వల్లే నాకు కూడా నటుడిని కావాలని కోరిక స్కూల్లో ఉన్నప్పుడే కలిగింది.  

నా అభిమాన నటుడు ఎవరు అని ఎవరు అంటే ఎస్వీ రంగారావు అని గర్వంగా చెబుతుంటాను. నా అభిమాన నటి ఎవరు అంటే సావిత్రి గారి పేరు చెబుతుంటాను. ఎలాంటి డైలాగ్ డైలాగ్ అయినా అనర్గళంగా తడబాటు లేకుండా చెప్పగలగడం ఎస్వీ రంగారావు స్టైల్ అని చిరంజీవి ప్రశంసించారు.

46
ఆయన పేరు చెబితే గుర్తొచ్చే పాత్రలు అవే

ఎస్వీ రంగారావు 1918 నూజివీడులో జన్మించారు. ఎస్.వి.రంగారావు గారి అసలు పేరు సామర్లకోట వీరరాఘవ రంగా రావు. ఆయన విజయవాడలో ఇంజినీరింగ్‌ చదివారు. కానీ నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చారు.ఆయన నటనకు బలం నాటక రంగం నుంచే వచ్చింది. స్టేజ్‌పై ఆయన నటన చూసి దర్శకులు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.

ఎస్వీ రంగారావు పేరు చెప్పగానే ఆయన పోషించిన మాయాబజార్ చిత్రంలోని ఘటోత్కచుడు, భక్త ప్రహ్లాద చిత్రంలోని హిరణ్యకశ్యప, పాతాళభైరవి చిత్రాల్లోని కపాల మాంత్రికుడు లాంటి పాత్రలు గుర్తుకు వస్తాయి. ఎస్వీ రంగారావు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. వారికి పోటీగా ఎస్వీఆర్ నటన ఉండేది. ఆయన నటించిన ప్రతి పాత్రకూ ప్రాణం పెట్టేవారు. "మాయాబజార్"లో ఘటోత్కచుడు పాత్రలో ఆయన పలికించిన హావభావాలు ఇప్పటికీ ఎన్నో జనరేషన్లను ఆకట్టుకుంటున్నాయి.

56
అంతర్జాతీయ అవార్డు

పౌరాణిక చిత్రాల్లో ఆయన కీచకుడిగా, హిరణ్య కశ్యపగా, దుర్యోధనుడిగా, బకాసురిడిగా, నరకాసురిడిగా, రావణుడిగా ఇలా ఎన్నో నెగిటివ్ పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన నటించిన “నర్తనశాల” (1963) చిత్రంలో “కీచకుడు” పాత్రకు జకార్తాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు అవార్డు (Best Actor) దక్కింది. అప్పట్లో ఒక భారతీయ నటుడు పొందిన అరుదైన అంతర్జాతీయ గౌరవం ఇది. ఎస్వీ రంగారావు నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించారు. 

ఎస్వీ రంగారావు గారు చాలా మంచి ఇంగ్లిష్ స్కాలర్ కూడా. ఆయనకు ఆంగ్ల సాహిత్యం మీద మక్కువ ఉండేది. అందుకే ఆయన డైలాగ్ డెలివరీలో క్లాసికల్ టోన్ ఉండేది. ఆయనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా, "నేను కళాకారుడిని" అంటూ నెమ్మదిగా తిరస్కరించేవారు.

సినిమాల్లో గొప్ప పాత్రలు పోషించిన ఎస్వీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప హృదయంతో ఉండేవారు. కానీ సినిమాకి న్యాయం చేయడమే ఆయన లక్ష్యం. అవసరమైతే నిర్మాతని ఆదుకునేందుకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారట. "విలన్ పాత్రను గొప్పగా చూపగలిగితేనే హీరో మెరుస్తాడు" అన్నదే ఆయన తత్వం. అందుకే ఆయన పోషించిన హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కీచకుడు వంటి పాత్రలు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

66
చిరంజీవి నటిస్తున్న చిత్రాలు

ఇక చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఆలస్యం అవుతుండడంతో రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  

చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం మెగా 157. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

చిరంజీవి చివరగా నటించిన భోళా శంకర్ చిత్రం నిరాశపరిచింది. దీనితో చిరంజీవి నుంచి అభిమానులు సాలిడ్ కంబ్యాక్ ఆశిస్తున్నారు. విశ్వంభర మూవీ జానపద కథాంశంతో రూపొందుతోంది. అయితే వరుసగా ఈ చిత్రం వాయిదా పడుతుండడం వల్ల బజ్ తగ్గుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories