మహేష్ బాబు, నాగచైతన్యతో పాటు రెస్టారెంట్లు నడుపుతున్న ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా?

Published : Jun 19, 2025, 03:15 PM IST

సినిమాల్లో కోట్లు సంపాదించిన స్టార్స్ చాలామంది, ఆ డబ్బులను బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ వైపు హీరోలు ఎక్కువగా చూస్తున్నారు. అందులో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసా? 

PREV
19

సినిమా ప్రముఖుల రెస్టారెంట్లు

సినిమా సెలబ్రిటీలు సినిమాల్లో నటించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఆ కోట్ల రూపాయలను ఇతర వ్యాపారాలలో పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా చాలామంది సినిమా తారలు రెస్టారెంట్ బిజినెస్ లు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలలో సొంత హోటల్స్ ను నడుపుకుంటున్నారు స్టార్స్. రీసెంట్ గా హీరో ఆర్య పై ఐటీ రైడ్స్ జరగడం, గతంలో ఆయన హోటల్ బిజినెస్ గురించి బయటకు రావడంతో.. ఈరంగంలో ఉన్న స్టార్స్ ఎవరబ్బా అని వెతుకుతున్నారు నెటిజన్లు.

29

ఆర్య హోటల్ వ్యాపారం

కోలీవుడ్‌ హ్యాండ్సమ్ హీరోలలో ఆర్య ఒకరు. ఆయన సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి అనేక చిత్రాలను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా కూడా ఆర్య డిడి నెక్స్ట్ లెవల్ అనే సినిమాను నిర్మించారు. సంతానం ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు.

నటుడు ఆర్య సినిమాతో పాటు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. గతంలో ఆయన ఒక హోటల్ రన్ చేశారు. చెన్నైలోని వేలచ్చేరిలో సీ షెల్ అనే హోటల్ కు ఆర్య ఫౌండర్. వీటి బ్రాంచ్ లు చాలా చోట్ల ఉన్నాయి. అయితే ఈ హోటల్స్ ద్వారా ఆర్య బాగా సంపాధించినట్టు తెలుస్తోంది. 

అయితే తాజా సమాచారం ప్రకారం వీటిని గతంలోనే కేరళకు చెందిన వారికి ఆర్య విక్రయించినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆర్య ఇంటితో పాటు సీ షెల్ హోటల్స్ పై కూడా ఐటీ రైడ్స్ జరిగిన సందర్భంలో ఈ విషయాలు బయటకు వచ్చాయి.

39

నాగ చైతన్య హోటల్ బిజినెస్ లు

ఇక టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో నాగ చైతన్య కూడా హోటల్ బిజినెస్ లు రన్ చేస్తున్నారు. కరోనా పాండమిక్ టైమ్ లో మాదాపూర్‌లో ‘షోయు’ అనే పాన్-ఏషియన్ క్లౌడ్ కిచెన్‌ను ఆయన ప్రారంభించాడు. సుషీ, డిమ్‌సమ్స్, జపనీస్ స్వీట్స్‌కు ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. 

2024లో, షోయు తమ మెనూలో కొరియన్ BBQ, థాయ్ కర్రీలను కూడా చేర్చింది. అంతేకాదు, ఇంట్లోనే వండుకోవడానికి వీలుగా DIY మీల్ కిట్స్‌ను కూడా ఈ రెస్టారెంట్ అందిస్తోంది. ప్రస్తుతం పూర్తి స్థాయి ఏషియన్ వంటకాలతో రెస్టారెంట్‌ కళకళలాడుతుంది. ఈ బిజినెస్ లో చైతు గట్టిగానే సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.

49

మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లు

సూపర్ స్టార్ మహేష్ బాబు, తన సతీమణి నమ్రత శిరోద్కర్‌తో కలిసి కొన్ని బిజినెస్ లు చేస్తున్నారు. అయితే వారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా మినర్వా, ఏషియన్ గ్రూప్స్‌తో పార్ట్‌నర్‌షిప్ లో ‘AN రెస్టారెంట్స్’ను స్టార్ట్ చేశారు. బంజారా హిల్స్‌లో మొదలైన ఈ ఫైన్ డైనింగ్ బ్రాండ్, ఇప్పుడు ఇతర సిటీస్ లో కూడా విస్తరిస్తోంది.

 ఈ రెస్టారెంట్‌లో హైదరాబాదీ స్పెషల్ వంటకాలతో పాటు గ్లోబల్ డిషెస్ కూడా అందిస్తున్నారు. 2024లో వీరు క్లౌడ్ కిచెన్ మోడల్‌ను కూడా పరిచయం చేశారు. ఈ బ్రాండ్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్‌కి, ఫుడ్ లవర్స్‌కి, ఓ టాప్ ఛాయిస్‌గా మారిపోయింది.

59

సందీప్ కిషన్ వివాహ భోజనంబు

ఇక టాలీవుడ్ యంగ్ స్టార్ సందీప్ కిషన్ కూడా ఫడ్ బిజినెస్ లో దిగారు. సినిమాలు సరిగ్గా లేక, ఉన్నసినిమాలు హిట్ అవ్వక చాలా ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్నాడు సందీప్ కిషన్‌. దాంతో ఆయన కరోనా టైమ్ లో హైదరాబాద్ లో 'వివాహ భోజనంబు' అనే హోటల్ ను ప్రారంభించారు. అచ్చ తెలుగు వంటకాలతో, ఇంటి వాతావరణం క్రియేట్ చేసి మరీ ఈ రెస్టారెంట్ ను నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ హోటల్స్ ను విస్తరించే పనిలో ఉన్నారు సందీప్.

69

సిమ్రాన్ కూడా హోటల్ నడుపుతుందా?

1990లలో తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా సిమ్రాన్ స్టార్ డమ్ తెచ్చుకుంది. 1995 నుండి 2005 వరకు 10 సంవత్సరాలు సిమ్రాన్ హీరోయిన్ గా చాలా బిజీగా ఉంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడి, తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది స్టార్ హీరోయిన్. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో మరోసారి చర్చల్లో నిలిచింది సిమ్రాన్.

సినిమాల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌ సిమ్రాన్ చెన్నైలో సొంతంగా హోటల్‌ను కూడా నడుపుతోంది. ఆమె నడుపుతున్న గడ్కే బై సిమ్రాన్ అనే రెస్టారెంట్ చెన్నైలోని షోలింగనల్లూర్‌లో ఉంది. ఈ హోటల్‌లో ఆహారం ఖరీదైనదని చెబుతారు.

79

జీవా నడుపుతున్న హోటల్

కోలీవుడ్‌ హీరో జీవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కు కూడా గుర్తుండిపోయాడు. వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జీవా స్టార్ హీరో మాత్రం అవ్వలేకపోయాడు. అతని తండ్రి ఆర్.పి. చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జీవా ఆ సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నారు. జీవా చాలా సంవత్సరాలుగా సాలిడ్ సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు.

ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బ్లాక్ సినిమా జీవాకు కాస్త రిలీఫ్ ను ఇచ్చింది. ఇదిలా ఉంటే హీరో జీవా సినిమాతో పాటు హోటల్ వ్యాపారంలో కూడా ఉన్నారు. ఆయనకు చెన్నైలో వన్ ఎంపీ అనే హోటల్ ఉంది. ఈ హోటల్ చెన్నైలోని ది నగర్‌లో ఉంది. ఈ హోటల్‌ను జీవా భార్య నిర్వహిస్తోంది.

89

సూరి నడుపుతున్న హోటల్

తమిళ కమెడియన్ సూరి అందరికి తెలిసే ఉంటుంది. డబ్బింగ్ సినిమాల ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా సూరి క్రేజ్ సంపాదించాడు. హాస్యనటుడిగా నటించడం ప్రారంభించి ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా మారాడు సూరి.

 వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విదుతుల్లు చిత్రంలో హీరోగా నటించిన తర్వాత, సూరికి హీరోగా నటించడానికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. గరుడన్, కొట్టుక్కలి, మామన్ వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇవ్వడం ద్వారా తమిళ సినిమాలో సంచలనంగా మారాడు సూరి.

కమెడియన్ గా చేస్తూ హీరోగా ఎదిగినవారు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉన్నారు. సునిల్, సంతానం లాంటివారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. సూరి మాత్రం సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సూరి, సినిమాలను దాటి హోటల్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టి విజయం సాధిస్తున్నాడు. మధురైలోని వివిధ ప్రాంతాలలో సూరికి అమ్మన్ మెస్ ఉంది. ఈ హోటల్ వ్యాపారాన్ని సూరి కుటుంబం చూసుకుంటుంది. సూరి అమ్మన్ రెస్టారెంట్ మధురైలో బాగా ఫేమస్ అయ్యింది.

99

వీరే కాదు చిన్న తెర నుండి సినిమాకి వచ్చి చాలా బిజీ హీరోయిన్‌గా మారిన ప్రియా భవానీ శంకర్ కూడా తన సంపాదనతో హోటల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. ఆమె లియామ్స్ డైనర్ అనే రెస్టారెంట్ నడుపుతోంది. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన విజె సన్నీ కూడా హైదరాబాద్ లో రెస్టారెంట్ ను నడిపిస్తున్నాడు. 'అమృతం అడ్డా' పేరుతో సన్నీ హోటల్ నడుస్తుంది. సినిమాలు లేకపోయినా బిజీనెస్ ద్వారా సన్నీ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ హోటల్ ను త్వరలో విస్తరించే పనిలో ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories