Chiranjeevi Breaking 24 Year Sentiment: మెగాస్టార్ చిరంజీవి సాహసం చేయబోతున్నారా? 24 ఏళ్ళుగా దాచిన సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నారా..? ఎన్నో ఏళ్ళ కోరికను బయటకు తీయ్యబోతున్నారా? సినిమా డేంజర్ లో పడుతుందని తెలిసినా.. స్టార్ హీరో చేయబోయే సాహసం ఏంటి?
Chiranjeevi Breaking 24 Year Sentiment: ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సినిమాల విషయంలో హీరోలు కాని, దర్శకులు కాని కలిసిరాని పనులు చేయరు. అలా చేసి వారి సినిమాలు వారే పోగోట్టుకోరు కదా? కొన్ని సెంటిమెంట్లు గట్టిగా ఫాలో అవుతుంటారు. ఉదాహరణకు మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్ కు వెళ్తే.. ఆసినిమా ప్లాప్ అవుతుందని నమ్ముతాడట.
అందుకే ఆయన తన సినిమా ఓపెనింగ్స్ కు వెళ్ళడు. అలా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఓ సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సెంటిమెంట్ ను కూడా దాదాపు 24 ఏళ్ళ తరువాత తాజాగా బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇంతకీ మెగా సెంటిమెంట్ ఏంటి..? ఆయన చేయబోయే సాహసం ఏంటి?
చిరంజీవి సినిమాల్లో ఆయన పాట పాడితే.. ఆసినిమా ప్లాప్ అవుతుందని నమ్ముతారని తెలుస్తోంది. గతంలో ఆయన పాట పాడిన సినిమాల ఫలితాలు తారుమారు అవవ్వడంతో, ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ వస్తున్నారు మెగాస్టార్. అందుకే గత 24 ఏళ్ళుగా ఆయన సినిమాల్లో పాటలు పాడింది లేదు. గతంలో ఎప్పుడో 1997 లో మాస్టర్ సినిమా కోసం 'తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే' అని పాట పాడారు చిరు. కాని ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. యావరేజ్ టాక్ తో నడిచింది. పాట కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
ఇక 2001 లో వచ్చిన మృగరాజు సినిమా కోసం కూడా మరోసారి గొంతు సవరించారు చిరంజీవి. 'అరె ఛాయ్ చటుక్కున్నా తాగరా భాయ్' అంటూ మాస్ సాంగ్ ను.. ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే ఈ సాంగ్ మాత్రం హిట్ అయ్యింది. మాస్ ఆడియన్స్ లో మోత మోగించేసింది. అప్పట్లో ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. కాని సినిమా సక్సెస్ కు మాత్రం ఈ సాంగ్ ఏమాత్రం ఉపమోగపడలేదు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన మృగరాజు డిజాస్టర్ అయ్యింది. కాన్సెప్ట్ అంత అద్భుతంగా ఉన్నా.. సినిమా మాత్రం హిట్ అవ్వలేదు.
Actor Chiranjeevi starrer Vishwambhara film update out
ఇక అప్పటి నుంచి చిరంజీవి తన సినిమాల్లో పాటలు పాడటం మానేశారు. మధ్యలో రాజకీయాల కోసం సినిమాలకు విరామం ఇచ్చారు మెగాస్టార్. ఆతరువాత రీ ఎంట్రీ ఇచ్చి కూడా చాలా ఏళ్ళు అవుతున్నా.. మెగాస్టార్ తన సినిమాల్లో ఇంత వరకూ పాట పాడింది లేదు.
అయితే ఈసారి మాత్రం విశ్వంభర సినిమా కోసం మరోసారి పాట పాడబోతున్నారట మెగాస్టార్. 24 ఏళ్ళ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. మరోసారి సాహసం చేయబోతున్నారని తెలుస్తోంది. కీరవాణి చిరంజీవి కోసం ఓ అద్భుతమైన పాటను రెడీ చేశారట.
మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. మెగా ఫ్యాన్ సర్కిల్ లో మాత్రం ఈ వార్త తెగ తిరిగేస్తోంది. అయితే గతంలో చాలామంది హీరోలు తమ సినిమాల కోసం, తమ స్నేహితుల సినిమాల కోసం పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చాలా కాలంగా తన సినిమాలకోసం ఒక్క పాట అయిన పాడుతుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అంతే తన సినిమాలకోసం చాలా పాటలు పాడిన ఆయన.. తన స్నేహితుల సినిమాల కోసం కూడా పాట పాడిన సందర్బాలు ఉన్నాయి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం లో వెంకటేష్ కూడా పాట పాడారు. అరే మామా ఏక్ పెగ్గులా అంటూ.. బాలయ్య కూడా పాటలు పాడారు. ఇలా చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాల కోసం గొంతు సవరించుకున్నారు. మరి చిరంజీవి ఈసారి విశ్వంభరతో ఏం మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.