హీరోయిన్‌తో కలిసి ప్రియదర్శి ఈ వీడియో చేయడం విశేషం. ఇందులో హీరోయిన్ ఫోన్‌లో డ్రెస్ చూసి `వాహ్ డ్రెస్ ఎంత బాగుందో కదా అని అంటుంది. అది చూసిన ప్రియదర్శి అవును బాగుంది అంటాడు, కింద రేట్ చూసి 15వేలా అని షాక్ అవుతూ, చాలా రేట్ ఎక్కువ అంటాడు. దీనికి హీరోయిన్ చిరాకుగా రియాక్ట్ అవుతూ, నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి.
రేపు నీ పెళ్లామో, గర్ల్ ఫ్రెండో డ్రెస్ చూపిస్తే ఇలా ఇంత ఖరీదా అన్నావో వదిలి పడదొబ్బుద్ది అని, అందుకే నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టి, ఈ ప్రేమలు, పెళ్లిళ్ల జోలికి పోమాకా అని వార్నింగ్ ఇస్తుంది. `ముష్టి డ్రెస్సే ఎక్స్ పెన్సివ్ అంటున్నావ్, రేపు నీ పెళ్లాం ల్యాండ్, బంగారం అడిగితే ఏం కొనిపెడతావ్ రా. ఈ పుస్తకం పక్కన పెట్టి నీ కెరీర్‌పై ఫోకస్ పెట్టు సరేనా అంటుంది.
ఇది విన్న ప్రియదర్శి చివరికి పచ్చళ్ల బిజినెస్ పెడతా అని అమాయకంగా చెప్పడం అదిరిపోయింది. ఇప్పుడిది వైరల్ అవుతుంది. ప్రియదర్శి.. అలేఖ్యచిట్టి పికిల్స్ ని మాస్ ర్యాగింగ్ అదిరిపోయిందంటున్నారు. వీళ్లే కాదు చాలా మంది యూట్యూబర్స్ ఇలా వీడియోలు చేస్తూ అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయిలను ఆడుకుంటున్నారు. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.
read more: ఏఎన్నార్‌లోని ఆ క్వాలిటీ తనకు లేదే అని బాధపడిన జూ ఎన్టీఆర్.. ఆ లక్షణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
also read: `కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో బిగ్ ట్విస్ట్.. సీజన్ 17 హోస్ట్ ఆయనే, స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?