మోహన్ బాబు , చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

Published : Dec 12, 2025, 11:16 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి , మంచు మోహన్ బాబు అంటే.. వారి మధ్య కోల్డ్ వార్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ గతంలో వీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. కలిసి ఎన్నో సినిమాలు చేశారు, ఒక మూవీలో అన్నదమ్ములుగా కూడా నటించారని మీకు తెలుసా? 

PREV
15
మెగా మంచు కోల్డ్ వార్..

టాలీవుడ్‌లో చిరంజీవి, మోహన్ బాబు మధ్య బంధం గురించి అందరికి తెలిసిందే. స్నేహితులుగా కనిపించినా, పోటీ పడాల్సిన విషయాల్లో.. వివాదాల్లో నిలుస్తుంటారు. ఇండస్ట్రీలో 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ ఇద్దరి స్థార్స్ మధ్య స్నేహం ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వీరిమధ్య వివాదాలు కూడా నడిచిన విషయం తెలిసిందే. సినిమాల విషయంలో పోటీ తారాస్థాయిలో జరిగిన రోజులు ఉన్నాయి. ఇక సినిమాలు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ విషయాలలో, భహిరంగంగా కూడా వీరి మధ్య ఎన్నో వివాదాలు నడిచాయి. కానీ ఇద్దరు కలిస్తే.. చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ.. స్నేహంగా ఉంటుంటారు. వజ్రోత్సవాల సమయంలో వీరి మధ్య జరిగిన వార్ ఇండస్ట్రీని కుదిపేసింది. ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అప్పట్లో మోహన్ బాబు కామెంట్స్ వల్ల మొదలైన మంటలు.. లోలోపల ఇప్పటికీ కంటీన్యూ అవుతూనే ఉంది. అది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది. ఆమధ్య జరిగిన మా ఎలక్షన్స్ లో కూడా ఈ ప్రభావం గట్టిగా చూపించింది.

25
చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్ మూవీస్

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఇప్పుడు వాతావరణం ఎలా ఉన్నా.. అప్పట్లో వీరు చాలా క్లోజ్ గా ఉండేవారు. కలిసి ఎన్నో సినిమాలలో కూడా నటించారు. లంకేశ్వరుడు, కొదమసింహం లాంటి సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. అయితే ఎక్కువ సినిమాల్లో చిరంజీవి హీరోగా, మోహన్ బాబు విలన్ గా నటించారు. అయితే వీరిద్దరు అన్నదమ్ములుగా నటించిన సినిమా కూడా ఒకటి ఉంది. ఆసినిమా ఏదోకాదు.. ' పట్నం వచ్చిన పతివ్రతలు'. ఈసినిమాలో మోహన్ బాబు అన్నగా.. చిరంజీవి తమ్ముడిగా నటించి మెప్పించారు.

35
అన్నదమ్ములుగా చిరంజీవి, మోహన్ బాబు

1982 లో రిలీజ్ అయిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో మోహన్ బాబు, చిరంజీవి అన్నదమ్ములుగా నటించి మెప్పించారు. పట్టణక్కె బంద పత్నియరు అనే కన్నడ సినిమాకు తెలుగు రీమేక్ గా ఈసినిమా రూపొందింది. మౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో చిరంజీవి జోడీగా రాధిక, మోహన్ బాబు జోడీగా గీత నటించారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో రాంగోపాల రావు నిర్మలమ్మ, నూతన్ ప్రసాద్, రామప్రభ, లాంటి స్టార్స్ నటించారు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో పాటు కామెడీ ప్రధానంగాసాగిన ఈ సినిమాను శ్రీనివాస ప్రొడక్షన్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మని నారాయణరావు సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 1 రిలీజ్ అయ్యిన సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరి కెరీర్ కు ఈ సినిమా బాగా ఉపయోగపడింది.

45
చిరంజీవి దూకుడు

చిరంజీవి, మోహన్ బాబు కాస్త తేడాతో ఇంస్ట్రీలో అడుగుపెట్టారు. ఇద్దరు కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. హీరోలుగా మారిన తరువాత కూడా మోహన్ బాబు కొన్ని సినిమాల్లో నెగెటీవ్ రోల్స్ చేశారు. 80, 90వ దశకంలో మెగాస్టార్ దూకుడు భారీగా పెరిగిపోయింది. వరుస సినిమాల విజయాలతో దూసుకుపోయాడు. డాన్స్, యాక్షన్, ఎమోషన్, అన్నిరకాల సినిమాలను రఫ్పాడించి వదిలిపెట్టారు చిరంజీవి. ఆయన్ను ఆపడం ఎవరి వల్ల కాలేదు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగి, మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు చిరు. అయితే ఆయన కెరీర్ లో ఎక్కువ హిట్లు ఇచ్చిన దర్శకుడు, కోదండరామిరెడ్డి. ఆయన డైరెక్షన్ లోనే చిరంజీవి ఎక్కువ సినిమాలు చేశారు. ఇక చిరంజీవి నుంచి వచ్చిన ఖైదీ, జగదేవక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ లాంటి సినిమాలు అభిమానులకు పూనకాలు తెప్పించాయి.

55
మెగాస్టార్ కు షాక్ ఇచ్చిన మంచు సినిమా..

మెహన్ బాబు కూడా 80, 90 స్ లో మోహన్ బాబు కూడా స్టార్ హీరోగా ఉన్నారు. ఆయన కూడా హిట్ సినిమాలు చేశారు.. కానీ మెగా రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయారు. సరిగ్గా అదే టైమ్ లో ఒక్క సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టారు మెహన్ బాబు. మెగా దూకుడుకు కాస్త బ్రేక్ వేయగలిగారు. ఆ సినిమా మరేదో కాదు పెదరాయుడు. చిరంజీవి బిగ్ బాస్ సినిమాతో పోటీ పడ్డ పెదరాయుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బిగ్ బాస్ మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి, మోహన్ బాబు కెరీర్ లో ఉత్కంఠ రేపిన పోరు ఇది. ఇక ఆతరువాత వీరిద్దరి కెరీర్ లో సినిమాలు, వివాదాల సంగతి తెలిసిందే?

Read more Photos on
click me!

Recommended Stories