Chiranjeevi: చిరంజీవి, హీరోయిన్ మాధవి 15 సినిమాల్లో కలిసి నటించారు. ఇన్ని చిత్రాల్లో కలిసి నటించినా.. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని సమాచారం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటీనటులైన మెగాస్టార్ చిరంజీవి, మాధవి దాదాపుగా 15 చిత్రాలలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఇద్దరి జోడి స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. సినిమా సూపర్ హిట్ అనుకునేవారు. వీరి కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.
25
కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవలేదట..
ఇదిలా ఉంటే.. వీరిద్దరి జోడీ 15 సినిమాల్లో కనిపించినప్పటికీ, వీరి మధ్య తెరపై అనుకున్నంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదని అప్పట్లో సినీ వర్గాలలో చర్చ ఉండేదట. తొలినాళ్లలో నటి మాధవి.. చిరంజీవి పట్ల కాస్త రిజర్వ్‌డ్‌గా ఉండేదని, పెద్దగా పట్టించుకునేది కాదని చెబుతుంటారు.
35
చుక్కలు చూపించేది..
ఈ కారణంగానే చిరంజీవి కూడా చాలా సినిమాల్లో మాధవితో కలిసి నటించేటప్పుడు కాస్త బెరుగ్గానే షూటింగ్‌లను పూర్తి చేశారట. ఒక దశలో మాధవిని తాకే ప్రయత్నం చేస్తే గుర్రున చూసేదనే సినీ వర్గాల్లో ప్రచారం కూడా సాగింది.
అయితే కాలక్రమేణా వారి మధ్య బంధం పూర్తిగా మారిందని.. ముఖ్యంగా చిరంజీవి వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం బలపడిందట. ఆ తర్వాత మాధవి చిరంజీవితో కలివిడిగా ఉండటమే కాకుండా, వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారని సమాచారం.
55
ఫ్రెండ్ షిప్ ఇలా..
ఇలా చిరంజీవి, మాధవిల మధ్య ఫ్రెండ్‌షిప్ వృత్తిపరంగా మారుతూ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. అటు వరుసగా మాధవి, చిరంజీవితో కలిసి సినిమాలు చేస్తుండటంతో.. బాలకృష్ణతో నటించే అవకాశాన్ని కూడా రిజెక్ట్ చేసిందని టాక్.