Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్

Published : Dec 12, 2025, 10:52 AM IST

Suma Rajeev Divorce: సుమ కొడుకు రోషన్ కనకాల... మోగ్లీ నిమాతో ప్రజల ముందు ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. మోగ్లీ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సుమ, రాజీవ్ విడాకుల విషయం గురించి కూడా వివరించాడు. 

PREV
14
రోషన్ కనకాల ఏం చెప్పాడంటే...

తెలుగులో టాప్ యాంకర్ అంటే సుమ పేరే గుర్తొస్తుంది. ఆమె వారసుడిగా రోషన్ కనకాల సినీ అరంగేట్రం ఇచ్చాడు. బబుల్ గేమ్ సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. ఇప్పుడు మోగ్లీ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలలో కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా సుమ, రాజీవ్ కనకాల మధ్య విడాకుల విషయంలో ఏం జరిగిందో కూడా వివరించి చెప్పాడు. ఆ సమయంలో తాము ఇలా ఎమోషనల్ దాడికి గురయ్యామో కూడా వివరించాడు.

24
చదువు ఇష్టం లేదు

ప్రముఖ టీవీ యాంకర్ సుమా కనకాల, నటుడు రాజీవ్ కనకాల కొడుకుగా రోషన్‌కు ఇప్పటికే ఎంతో మంచి గుర్తింపు ఉంది. అయితే తనకు తాను సొంతంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. చిన్నప్పటినుంచి చదువుపై కాకుండా సినిమా పైనే దృష్టి ఉండేదని చెప్పాడు రోషన్. అందుకే అతి కష్టం మీద ఇంటర్ వరకే కాలేజ్ కు వెళ్లానని, ఆపైన అమ్మ బలవంతం మీదే డిస్టెన్స్లో బీకాం పూర్తి చేసినట్టు వివరించాడు. తన తాత దేవదాసు కనకాల దగ్గర నటనలో శిక్షణ కూడా తీసుకున్నానని వివరించాడు. ఎవరు తనను ఎన్ని విధాలుగా విమర్శించిన వినీ విననట్టు వదిలేస్తానని చెప్పాడు.

34
అమ్మానాన్న ఆ సమయంలో...

ఇక తల్లిదండ్రులు సుమ, రాజీవ్ ల మధ్య మూడేళ్ల క్రితం విడాకులు అయ్యాయన్న వార్తలు గురించి ప్రశ్నించగా... అవి తాను కూడా విన్నానని ఆ సమయంలో ఇంట్లో అంతా ఎమోషనల్ అయ్యారని చెప్పాడు రోషన్. తల్లి సుమ కూడా చాలా ఎమోషనల్ అయ్యారని.. కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు మాత్రమే తెలుసు అని అన్నాడు రోషన్. బయట వారు ఇలా పుకార్లు ఎందుకు పుట్టిస్తారో.. తమకు తెలియదని, నిజానికి ఆ సమయంలో అమ్మానాన్న ఇద్దరు కలిసే ఉన్నారని ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని చెప్పాడు రోషన్. అప్పట్లో ఎవరిని కలిసినా మొదట ఇదే విషయం తనను అడిగేవారని.. ఏం చెప్పాలో తెలిసేది కాదని అన్నాడు. ఆ తర్వాత అలవాటైపోయిందని అన్నాడు యువ నటుడు రోషన్ కనకాల. ఇలాంటి పుకార్లు పుట్టించే వారు కర్మ ఫలితాన్ని కచ్చితంగా పొందుతారని.. తిరిగి వారు కూడా అలాంటి బాధను అనుభవించే రోజులు వస్తాయని అన్నాడు రోషన్.

44
మోగ్లీ సినిమా విడుదల

రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న రెండో చిత్రం మోగ్లీ. ఇది డిసెంబర్ 13వ తారీకున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇందులో హీరోయిన్ గా సాక్షి మడోల్కర్ నటిస్తుండగా, సరోజ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. వీరి ముగ్గురు మధ్య మొగ్లీ కదా తిరుగుతుందని చెబుతున్నారు మేకర్లు. ఇది మనసుకు హత్తుకునే ప్రేమ కథ అని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని వివరిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం కీరవాణి కొడుకు కాలభైరవ అందించాడు. ఇక సినిమాను దర్శకత్వం వహించింది సందీప్ రాజ్.

Read more Photos on
click me!

Recommended Stories