మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు. అదే సమయంలో ఫ్లాప్ చిత్రాలు ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సినిమా విజయం సాధించాలంటే కంటెంట్ తో పాటు రిలీజ్ ప్లాన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఖైదీ చిత్రంతో చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగారు.
DID YOU KNOW ?
ప్రతి ఏడాది ఇండస్ట్రీ హిట్టు
1987 నుంచి 1992 వరకు చిరంజీవి ప్రతి ఏడాది ఇండస్ట్రీ హిట్టు సాధించి అరుదైన రికార్డ్ సృష్టించారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు చిత్రాలు వరుసగా ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి.
25
చిరంజీవి 75వ చిత్రం
ఆ టైంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ స్థానాన్ని చిత్రాన్ని భర్తీ చేస్తున్నారని అంతా ప్రశంసించడం ప్రారంభించారు. అప్పటి సూపర్ స్టార్ కృష్ణ ఇంకా మంచి ఫామ్ లోనే ఉన్నారు. 1985లో చిరంజీవి చట్టంతో పోరాటం చిత్రంతో ఊహించని షాక్ తగిలింది. ఆ చిత్రం చిరంజీవి 75 వ మూవీ. ఖైదీ చిత్ర హీరోయిన్లు మాధవి, సుమలత లతో చిరంజీవి మరోసారి చట్టంతో పోరాటం చిత్రంలో నటించారు.
35
సూపర్ స్టార్ కృష్ణ వల్ల చిరంజీవి మూవీ ఫ్లాప్
బాపయ్య దర్శకత్వంలో చట్టంతో పోరాటం చిత్రం రూపొందింది. ఇది కూడా సిస్టంకి వ్యతిరేకంగా పోరాడే కథతో రూపొందించిన చిత్రమే. సినిమా బావున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీనికి కారణం సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నటించిన అగ్నిపర్వతం 1985 సంక్రాంతికి విడుదలైంది. అదే రోజున చిరంజీవి చట్టంతో పోరాటం చిత్రం కూడా రిలీజ్ అయింది.
అగ్నిపర్వతం చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ మూవీలో కృష్ణ ఫైరీ పెర్ఫార్మన్స్, డైలాగులు ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. అగ్నిపర్వతం చిత్రం ముందు చట్టంతో పోరాటం మూవీ తేలిపోయింది. చట్టంతో పోరాటం చిత్రం బావున్నప్పటికీ ప్రేక్షకులు అగ్నిపర్వతం చిత్రం వైపే మొగ్గు చూపారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రానికి ఎదురెళ్ళడం వల్లే చిరంజీవి 75 వ చిత్రం ఫ్లాప్ అయింది.
55
తిరిగి పుంజుకున్న చిరు
అదే ఏడాది చిరంజీవి విజేత, అడవి దొంగ చిత్రాలతో సూపర్ హిట్స్ సాధించి తిరిగి పుంజుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర, మెగా 157 చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.