ప్రభాస్‌ కొత్త సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే.. `రాజాసాబ్‌`, `ఫౌజీ`ల పరిస్థితేంటంటే?

Published : Jul 27, 2025, 02:30 PM IST

ప్రభాస్‌ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. తాజాగా కొత్త సినిమా షూటింగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. 

PREV
15
ప్రభాస్‌ కొత్త సినిమా అప్‌ డేట్‌

డార్లింగ్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద స్టార్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఫ్లాప్‌ మూవీ కూడా దాదాపు మూడు నాలుగు వందలకోట్లు వసూలు చేస్తాయంటే ఆయన రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఆయన చేతిలో ఐదారు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా అప్‌ డేట్‌ వచ్చింది. కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఎప్పుడో తెలిసిపోయింది.

DID YOU KNOW ?
ప్రభాస్‌ ఫస్ట్ టైమ్‌
ప్రభాస్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు హర్రర్‌ మూవీ చేయలేదు. మొదటి సారి `ది రాజాసాబ్‌` సినిమా చేస్తున్నారు. ఇది హర్రర్‌ ఫాంటసీగా రూపొందుతోంది.
25
`రాజా సాబ్‌` షూటింగ్‌ పూర్తి చేసే పనిలో డార్లింగ్‌

ప్రస్తుతం ప్రభాస్‌ `ది రాజాసాబ్‌` మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది ప్రభాస్‌ కెరీర్‌లోనే మొదటిసారిగా హర్రర్‌ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

 రొమాంటిక్‌ హర్రర్‌ ఫాంటసీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు మారుతి. తన మార్క్ కామెడీ ఇందులో హైలైట్ గా ఉండబోతుందట. 

సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, రొమాన్స్ పరంగా కొదవలేదని, ఇటీవల కాలంలో ప్రభాస్‌ నుంచి మిస్‌ అయిన రొమాన్స్ ఇందులో చూడొచ్చు అని మారుతి తెలిపారు.

 డిసెంబర్‌ 5న మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, కొంత ప్యాచ్‌ వర్క్ మిగిలి ఉందని, అది కంప్లీట్‌ చేసే పనిలో ప్రభాస్‌ ఉన్నారట.

35
ఆగస్ట్ లో `ఫౌజీ` సినిమా సెట్‌లోకి ప్రభాస్‌

ఆగస్ట్ లో `ఫౌజీ` సెట్‌లోకి అడుగుపెడతాడట ప్రభాస్‌. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్ లేదు. 

కొన్ని సినిమా థీమ్‌ని చెప్పే పోస్టర్లు వచ్చాయి, గానీ ప్రభాస్‌ లుక్‌గానీ, టైటిల్‌ గానీ రివీల్‌ చేయలేదు. పీరియాడికల్‌ వార్‌ ప్రధానంగా సాగే లవ్‌ స్టోరీతో సాగుతుందని తెలుస్తుంది.

 ఇందులో డార్లింగ్‌ సైనికుడిగా కనిపించబోతున్నారట. ఈ చిత్ర షూటింగ్‌ని ఆగస్ట్ లో పూర్తి చేయాలని భావిస్తున్నారట. దీన్ని వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.

45
`స్పిరిట్‌` షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా

ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేయబోతున్నారు డార్లింగ్‌. నెక్ట్స్ ఆయన సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 

ఈ మూవీ షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చారు దర్శకుడు సందీప్‌. సెప్టెంబర్‌ ఎండింగ్‌లో మూవీని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఒక్క సారి షూటింగ్‌ స్టార్ట్ అయ్యిందంటే గ్యాప్‌లేకుండా సినిమా షూటింగ్‌ చేయాలని భావిస్తున్నారట. 

ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఉన్నట్టు తెలిపారు సందీప్‌. విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన `కింగ్‌డమ్‌` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో సందీప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. డార్లింగ్‌ ఫ్యాన్స్ కి మంచి ఊపిచ్చే వార్తని వెల్లడించారు.

55
ప్రభాస్ చేయాల్సి సినిమాలివే

సందీప్‌ రెడ్డివంగాతో ప్రభాస్‌ చేయబోయే మూవీ మాదకద్రవ్యాల మాఫియా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో డార్లింగ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని, ఆయన పాత్రలో కాస్త నెగటివ్‌ షేడ్‌ కూడా ఉంటుందని సమాచారం. 

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో `యానిమల్‌` ఫేమ్‌ డిమ్రీ తృప్తి హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. 

ఇక ప్రభాస్‌ `ది రాజాసాబ్‌`, `ఫౌజీ`, `స్పిరిట్`లతోపాటు ప్రశాంత్‌ వర్మతో మూవీ, అలాగే `సలార్‌ 2`, `కల్కి 2` చేయాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories