ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...అంకిత, శృతి, ప్రేమ్ తులసి దగ్గరికి వచ్చి, ఎలాగో సామ్రాట్ గారు ఇక్కడ వరకు వచ్చారు కదా మీ మధ్య ఉన్న అబద్ధాలు తొలగించుకుంటే మంచిదేమో అని సలహా ఇస్తారు. అదే సమయంలో నందు లాస్యలు ఒకవైపు నుంచి, సామ్రాట్ ఇంకోవైపు నుంచి వాళ్ళ మాటలు వింటారు. అప్పుడు తులసి ,సామ్రాట్ గారూ నామీద గౌరవంతో లోపలికి వచ్చారు, ఏ గోల లేకుండా ప్రశాంతంగా ఈరోజు గడుస్తుంది. సామ్రాట్ గారు నామీద ఇంకా కోపంగానే ఉన్నారు అందుకే బయటే ఉండిపోయారు. ఇప్పుడు క్షమించమని నేను అడిగితే అది నా అత్యాశ అవుతుంది. ఈరోజు మళ్లీ గొడవ పెట్టడానికి నేను ఇష్టపడడం లేదు కనుక ఇలాగే వదిలేద్దాం అని అంటుంది తులసి.