నిర్మాతలను భయపెడుతున్న బులిరాజు, రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్

Published : Mar 18, 2025, 11:01 AM IST

నిర్మాతలను భయపెడుతున్నాడట బులిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన తండ్రిని ఏదైనా అంటే బూతులతో భయపెట్టిన ఈ బుడ్డోడు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ను మాత్రం తన రెమ్యునరేషన్ తో భయపెడుతున్నాడట. ఇంతకీ ఇందులో నిజం ఎంత.?  

PREV
15
నిర్మాతలను భయపెడుతున్న బులిరాజు, రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్

ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నారు పెద్దలు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్న యాక్టర్స్ నుంచి పెద్దగా డిమాండ్స్ ఉండవు కాని.. ఇప్పుడిప్పుడే వస్తున్న నటులు మాత్రం ఒక్క సినిమా హిట్ అయితే చాలు  నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. నిర్మాతల నుంచి గట్టిగా లాగాలని ప్రయత్నిస్తున్నారు. అది హీరోలైనా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయినా.. ఎవరైనా సరే డిమాండ్ విషయంలో మాత్రం తగ్గేది లేదు అంటున్నారు. 

Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

25
Sankranthiki vasthunam bulli raju in laila Movie

మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని. రెమ్యునరేషన్ల విషయంలో మాత్రం సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈమధ్య సంక్రాంతి కానకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందుంది. ఈసినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది అని ఎవరు అనుకోలేదు.

పాన్ ఇండియా సినిమాలకు పోటీ ఇస్తూ.. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది  ఈమూవీ. వెంకటేష్, ఐశ్వర్య రాజేషష్, మీనాక్షీ జంటగా  అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరెక్కిన ఈసినిమాలో  ఓ స్పెషల్ క్యారెక్టర్ అందరిని ఆకట్టుకుంది. 

Also Read: 21,000 కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియా హీరోకి భార్య ఎవరో తెలుసా?

35
Sankranthiki Vasthunam Kid Bulli raju father Filed police complaint in telugu

ఆ పాత్ర గురించి అందరికి తెలసిందే బులిరాజు. వెంకటేష్ కొడుకు పాత్ర చేసిన ఈ బుల్లి బులిరాజు పాత్రకు అందరు ఫిదా అయిపోయారు. తండ్రిని ఎవరైనా ఒక్క మాట అంటే ఏమాత్రం ఊరుకోని డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ఈ క్యారక్టర్ మాట్లాడే భూతులను చూసి థియేటర్స్ లో ఆడియన్స్ పొట్టచెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. ఈ క్యారెక్టర్ పోషించిన బుడ్డోడి పేరు రేవంత్ . ఎన్నికల ప్రచారం లో హుషారుగా క్యాంపైన్ చేస్తూ కనిపించిన వీడియోలను చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి పిలిపించి మరీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు. 

 

45

అయితే దర్శకుడు అనుకున్నదానికంటే ఎక్కవే చేసి చూపించాడు రేవంత్. ఇక ఈసినిమాతో బులిరాజు పాత్రకు వచ్చిన రెస్పాన్స్ తో ఇప్పుడు  ఈ బుడ్డోడికి టాలీవుడ్ లో ఆఫర్స్ క్యూలు కడుతున్నాయి. డిమాండ్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా భారీగా అడుగుతున్నాడట రేవంత్.

బులిరాజుతో సినిమా చేయాలి అంటే రోజుకు లక్షరూపాయలు  అడుగుతున్నారట. గతంలో పెద్ద పెద్ద కమెడియన్లు బ్రహ్మానందం లాంటి స్టార్స్ రోజుకు మూడు నుంచి ఐదు లక్షలు డిమాండ్ చేసేవారు. ఇక ఇప్పుడు బులిరాజు లక్ష డిమాండ్ చేయడంతో నిర్మాతలు అమ్మో అంటున్నారట. 

 

55

మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం గాసిప్ తెగ తిరిగేస్తోంది. బులి రాజు కు ఇప్పుడు అవకాశాలు బాగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి కెరీర్ ను సెట్ చేసుకుంటే టాప్ కమెడియన్ అయ్యే అవకాశాలుఉన్నాయి. గతంలో భరత్ మాదిరి ఇప్పుడు బులిరాజుకు మంచి అవకాశం ఉంది. మరి బులిరాజు అలియాస్ రేవంత్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories