280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. పొలిటికల్‌గా సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్

Published : Mar 18, 2025, 09:35 AM IST

Manchu Vishnu: మంచు విష్ణు లేటెస్ట్ గా చేసిన పొలిటికల్‌ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.  మూడు రాష్ట్రాల్లో 280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. 

PREV
15
280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. పొలిటికల్‌గా సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్
manchu vishnu

Manchu Vishnu: మంచు విష్ణు త్వరలో `కన్నప్ప` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రమిది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు వరుసగా ఇంటర్వూలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి ఆ కథేంటో చూస్తే. 

25

మంచు విష్ణు, తండ్రి మోహన్‌ బాబుతో కలిసి `కన్నప్ప` చిత్రాన్ని సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇందులో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ వంటి భారీ కాస్టింగ్‌ ఉండటం విశేషం. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మైథలాజికల్‌ ఫాంటసీ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. బిగ్‌ స్టార్స్ ఉండటంతో సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. 
 

35
kannappa

వచ్చే నెల 25న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది `కన్నప్ప`. ఈ మూవీ ప్రమోషన్స్ లో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నారు. ఇందులో ఆస్కార్‌ అవార్డులు, నెగటివిటీ వంటి అంశాలపై, సినిమా గురించి, ప్రభాస్‌ మంచి తనం గురించి, సినిమాలో ఆయన పాత్ర గురించి వెల్లడించారు. ప్రభాస్‌, మోహన్‌లాల్‌ పారితోషికం తీసుకోకుండా నటించినట్టు తెలిపారు. 

45
manchu vishnu

మరో ఇంటర్వ్యూలో విష్ణు పొలిటికల్‌గా ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. తనకు 280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారట. తెలంగాణలో వంద మంది ఎమ్మెల్యేలు క్లోజ్‌ అని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 160 మంది ఎమ్మెల్యేలు బాగా తెలుసు అని, తమిళనాడులో 20 మంది ఎమ్మెల్యేలు తెలుసు అని వెల్లడించారు.

ఇలా మూడు స్టేట్స్ లో ఎమ్మెల్యేలు క్లోజ్‌ అని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేంటనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఇది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మంచు విష్ణు ఈ కామెంట్లకి కారణాలు తెలియాల్సి ఉంది. 
 

55
manchu family

ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీలో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. మంచు మనోజ్‌.. తమ ఎంబీ యూనివర్సిటీ, శ్రీవిద్యానికేతన్‌ స్కూల్స్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నాడు. దాన్ని మంచు విష్ణు, మోహన్‌బాబు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య కొట్టుకునే స్థాయికి గొడవలు వెళ్లాయి.

ఒకప్పుడు టీడీపీ వైపు ఉన్న మోహన్‌ బాబు ఆ మధ్య వైసీపీకి క్లోజ్‌ అయ్యారు. ఇప్పుడు మళ్లీ టీడీపీకి క్లోజ్‌ అవుతున్నారు. మంచు మనోజ్‌.. నారాలోకేష్‌ని కలిశాడు. తమ ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటున్న నేపథ్యంలో మంచు విష్ణు ఇలాంటి కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. 

read  more: 20ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోయిన్‌తో చిరు.. మరో క్రేజీ భామ పేరు కూడా.. అనిల్‌ రావిపూడి అదిరిపోయే వంటకం

also read: ప్రభాస్‌ 'స్పిరిట్‌' స్టోరీ లీక్ ? ఆ సినిమా గుర్తు తెస్తోందేంటి
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories