కిరణ్ అబ్బవరం మరో హిట్ కొట్టాడు. `చెన్నై లవ్ స్టోరీ`తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం పది రోజులు పూర్తి చేసుకున్నారు. ఆదివారం వసూళ్లు పెరగడం విశేషం. పది రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
స్వచ్చమైన లవ్ స్టోరీస్ ఆదరణ పొందడం కష్టమవుతుంది. బోల్డ్ రొమాంటిక్ కథలకే ఆ ఆదరణ ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో కిరణ్ అబ్బవరం ఒక ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆయన `చెన్నై లవ్ స్టోరీ` చిత్రంలో నటించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఈ చిత్రం రెండు వారాల క్రితం(జులై 24న) ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
24
కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ నటన హైలైట్
`చెన్నై లవ్ స్టోరీ` ఒక ఫ్రెష్ లవ్ స్టోరీని సరికొత్తగా చూపించింది. స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తుందని చెప్పొచ్చు. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ప్రేమ కథలో శ్రీ గౌరీ ప్రియ ఇరగదీసింది. ఆమె నటనే సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. అదే స్థాయిలో కిరణ్ అబ్బవరం కూడా అదరగొట్టాడు. ఎమోషన్స్ పరంగా, ఎక్స్ ప్రెషన్స్ పరంగా వాహ్ అనిపించాడు. కొన్ని సీన్లలతో తన బెస్ట్ ఇచ్చాడు. నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. అందరి చేత ప్రశంసలందుకున్నాడు. ఫస్టాఫ్ సినిమా అదిరిపోయింది. కానీ సెకండాఫ్ కొంత తగ్గింది. అది బ్యాలెన్స్ అయి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదని చెప్పొచ్చు.
34
చెన్నై లవ్ స్టోరీ 10 రోజుల కలెక్షన్లు
ఇక ఈ మూవీ పది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే, ఈ చిత్రానికి రెండు రోజుల క్రితమే యాభై కోట్లు కలెక్ట్ చేసినట్టు టీమ్ ప్రకటించింది. మరి శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరిగాయి. ఆదివారం వీక్ డేస్‌తో పోల్చితే డబుల్ రావడం విశేషం. సాక్నిల్క్ సైట్ చెప్పిన లెక్కల ప్రకారం ఇది ఇప్పటి వరకు రూ.44.58 కోట్లు వసూలు చేసింది. ఆదివారం దీనికి ఊహించని విధంగా కలెక్షన్లు పెరిగాయి. ఏకంగా రూ.2.51కోట్లు రాబట్టడం విశేషం. ఇది కేవలం ఇండియాలోనే కావడం మరో విశేషం. ఇక రూ.37.88కోట్ల ఇండియా గ్రాస్, రూ.33కోట్ల నెట్ రాబట్టింది. ఓవర్సీస్‌లో దీనికి రూ.6.70కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకి సుమారు రూ.23కోట్ల షేర్ రావడం విశేషం.
`చెన్నై లవ్ స్టోరీ` చిత్రానికి ముప్పై కోట్ల బడ్జెట్ అయ్యిందని, రూ.16కోట్ల థియేట్రికల్ బిజినెస్‌గా లెక్కకట్టారు. దీంతో ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో వెళ్తుంది. ఇది ఈ వారం కూడా బాగానే ఆడే అవకాశం ఉంది. మరో ఐదారు కోట్లు రాబట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.