Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు

Published : Aug 03, 2026, 07:00 AM IST

చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు కొందరు ఉన్నారు. చిరంజీవి వారితో నటించిన సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఎందరో హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రాధికా, రాధా, నగ్మా, విజయశాంతి లాంటి హీరోయిన్లు చిరంజీవితో ఎక్కువగా సినిమాల్లో నటించారు. అయితే కొందరు స్టార్ హీరోల భార్యలు కూడా చిరంజీవికి అదృష్టం తెచ్చిపెట్టారు. చిరంజీవితో నటించిన హీరోయిన్లు ఆ తర్వాతి కాలంలో స్టార్ హీరోలని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఆ హీరోయిన్లు ఎవరు ? వారు చిరంజీవితో నటించిన సూపర్ హిట్ సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

25
అమల అక్కినేని

రాజా విక్రమార్క చిత్రంలో చిరంజీవికి హీరోయిన్ గా అమల నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అమల.. నాగార్జునని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే.

35
సుమలత

సుమలత చిరంజీవితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రంలో సుమలత కీలక పాత్రలో నటించారు. అదే విధంగా శుభలేఖ చిత్రంలో కూడా చిరంజీవి సుమలత నటించింది. ఆ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సుమలత కన్నడ స్టార్ అంబరీష్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

45
షాలిని

చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో షాలిని నటించింది. కానీ హీరోయిన్ గా కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. ఆ మూవీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెద్దయ్యాక షాలిని.. తమిళ స్టార్ తలా అజిత్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

55
జ్యోతిక

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఠాగూర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీలో జ్యోతిక.. చిరంజీవి భార్యగా నటించింది. ఆ తర్వాత జ్యోతిక.. హీరో సూర్యని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories