OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు

Published : Aug 03, 2026, 08:03 AM IST

ఈ వారం ఓటీటీలో వినోదాల విందు గ్యారెంటీ. అఖిల్ లెనిన్ మూవీ, మలయాళీ క్రైమ్ థ్రిల్లర్స్, హాలీవుడ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్స్, తమిళ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.

PREV
15
OTT Movies

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు భారీ వినోదం సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాలు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలు, అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లు వరుసగా స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఆగస్టు 4 నుంచి కొత్త టైటిల్స్ వివిధ ఓటీటీ ల్లో విడుదల కానున్నాయి. ఏ సినిమా, ఏ సిరీస్ ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

25
జియోహాట్‌స్టార్

ఉయిర్ 

మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ఉయిర్'లో రోషన్ మాథ్యూ, బైజు సంతోష్, అతుల్య చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నూరులో ఓ పాడుబడ్డ బావిలో మహిళ మృతదేహం లభించడంతో దర్యాప్తు ప్రారంభించిన కొత్త సబ్‌ఇన్‌స్పెక్టర్ కథ ఆధారంగా సినిమా సాగుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి రానుంది. 

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 4

ది షార్డ్స్ 

1980ల లాస్ ఏంజెల్స్ నేపథ్యంలో సాగే ఈ డ్రామా సిరీస్ ప్రముఖ రచయిత బ్రెట్ ఈస్టన్ ఎల్లిస్ నవల ఆధారంగా రూపొందింది. ఎలైట్ స్కూల్‌లో చదివే విద్యార్థుల జీవితం, అసూయ, ప్రేమ, ప్రమాదకర రహస్యాల చుట్టూ కథ తిరుగుతుంది. 

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 6

హస్టిల్ సీజన్ 5 

దేశంలో తదుపరి హిప్‌హాప్ స్టార్‌ను వెతికే ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో 'హస్టిల్' ఐదో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాద్‌షా, ఈపీఆర్, అగ్సీ, ప్యారడాక్స్, ఎంసీ స్క్వేర్ మెంటర్లుగా కనిపించనున్నారు. 

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 8

ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ 

2023లో వచ్చిన 'ది సూపర్ మారియో బ్రదర్స్ మూవీ'కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ యానిమేషన్ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరించనుంది. మారియో కొత్త శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడనేదే కథ. 

ఎక్కడ చూడాలి : జియోహాట్‌స్టార్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

35
నెట్‌ఫ్లిక్స్

ఇదయం మురళి 

అథర్వా, ప్రీతి ముఖుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామెడీ థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. 

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

మెయిన్ వాపస్ ఆవుంగా 

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ విభజన కాలం నేపథ్యంలో సాగే డ్రామా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. శర్వరి, వేదాంగ్ రైనా, నసీరుద్దీన్ షా, దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన లేకపోయినా ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. 

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7 (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)

ఆపరేషన్ సఫేద్ సాగర్ 

1999 కార్గిల్ యుద్ధం సమయంలో భారత వైమానిక దళం మానవీయ కోణాన్ని చూపించే ఈ సిరీస్‌లో సిద్ధార్థ్, జిమ్మీ షెర్‌గిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 

జపాన్‌కు చెందిన డేటింగ్ రియాలిటీ షో రెండో సీజన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 4

బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ 

ఫ్రైడ్ చికెన్ చరిత్ర, పరిశ్రమ వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక అంశాలను విశ్లేషించే డాక్యుమెంటరీ. 

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 5

ఇన్‌సైడ్ ది ట్రస్టర్ స్కాండల్ 

1990లలో స్వీడన్‌లో చోటుచేసుకున్న భారీ ఆర్థిక కుంభకోణం వెనుక జరిగిన పరిణామాలను చూపించే డాక్యుమెంటరీ. 

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 5

మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్ సీజన్ 3 

ప్రేమ త్రికోణం, కుటుంబ సమస్యల మధ్య యువతి జీవితం ఎలా మారుతుందనేది ఈ కొత్త సీజన్‌లో చూపించనున్నారు. 

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 6

అవర్ స్టిక్కీ లవ్ 

జ్ఞాపకశక్తి కోల్పోయిన ప్రాసిక్యూటర్, ఆమెను కాపాడేందుకు తనను ప్రియుడిగా పరిచయం చేసుకున్న మాజీ బాక్సర్ కథతో రూపొందిన కొరియన్ రొమాంటిక్ డ్రామా. 

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

రికీ గెర్వైస్: అల్లే క్యాట్స్ 

బ్రిటన్ వీధి పిల్లుల జీవితాన్ని వినోదాత్మకంగా చూపించే అడల్ట్ యానిమేటెడ్ సిట్‌కామ్.

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

డెత్ ఇంక్ సీజన్ 4 

ఈ సిరీస్ చివరి సీజన్‌లో అంత్యక్రియల సంస్థకు కొత్త నాయకుడి ఎంపిక ప్రధాన అంశంగా ఉంటుంది. ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

ది లాస్ట్ హౌస్ 

ఒక కుటుంబం ఇంట్లోనే చిక్కుకుపోయిన తర్వాత బతుకుదెరువు కోసం చేసే పోరాటం నేపథ్యంలో సాగే సర్వైవల్ థ్రిల్లర్. 

ఎక్కడ చూడాలి : నెట్‌ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

45
ప్రైమ్ వీడియో

స్టెర్లింగ్ పాయింట్ 

కుటుంబ రహస్యాలు, కనిపించని సోదరి కోసం అన్వేషణ నేపథ్యంలో సాగే కమింగ్-ఆఫ్-ఏజ్ మిస్టరీ డ్రామా. 

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో 

రిలీజ్ డేట్ : ఆగస్టు 5

వదంతి సీజన్ 2 

ఎం. శశికుమార్, యశ్వంత్, అనఘ, అపర్ణ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్. 

ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

55
జీ5

లెనిన్ 

అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఈ తెలుగు చిత్రం థియేటర్ల తర్వాత ఓటీటీలోకి రానుంది. థియేటర్స్ లో ఈ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అఖిల్, భాగ్యశ్రీ జంటగా నటించారు.

ఎక్కడ చూడాలి : జీ5 

రిలీజ్ డేట్ : ఆగస్టు 7

Read more Photos on
click me!

Recommended Stories