Actress Hema: నటి హేమ తన 35 ఏళ్ల సినీ కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించింది. రాజోలు నుంచి వచ్చిన ఈ నటి తన వృత్తి పట్ల నిబద్దతతో ఉంది. అలాగే తాను ఎదుర్కున్న కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
నటి హేమ తన 35 ఏళ్ల సినీ కెరీర్‌లో 350కి పైగా చిత్రాలలో నటించింది. ఎప్పుడూ తన వృత్తి పట్ల నిజాయితీతో, నిబద్దతతో ఉంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి పంచుకుంది నటి హేమ.
25
ఫ్యాషన్ సెన్స్ ఇలా..
హేమ ఫ్యాషన్ సెన్స్‌పై మాట్లాడుతూ.. 15 సంవత్సరాల క్రితమే ఆడియో ఫంక్షన్లలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కేవలం చీరలు ధరించే ట్రెండ్‌ను మార్చి.. లంగా ఓణీలు, హీరోయిన్లతో సమానమైన దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. ఇది కొందరికి అసూయను కూడా కలిగించిందని నటి హేమ తెలిపింది.
35
సినీ నేపధ్యం లేకుండా..
రాజోలు నుంచి ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా వచ్చిన హేమ.. తన ఏడో తరగతి చదువుతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఎప్పుడూ డబ్బు కోసం ఆరాటపడలేదని, తన నిజాయితీకి, కష్టానికి విలువ ఇచ్చింది. ముఖ్యంగా అతడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇండస్ట్రీలో ఎవరికీ తలవంచలేదని, నచ్చితేనే ఏ పని అయినా చేస్తానని, నచ్చకపోతే పక్కకు తప్పుకుంటానని తెలిపింది. సినిమా అవకాశాలు లేకపోతే, దోశల బండి పెట్టుకుని అయినా బ్రతుకుతానని, ఎవరినీ సహాయం అడగనని నటి హేమ చెప్పింది.
55
తనను పాజిటివ్ వైబ్ అంటూ..
ఇండస్ట్రీలో తన సత్సంబంధాలను కొనసాగిస్తున్న హేమ, తన ఫోన్ కాల్స్‌కు దర్శకులు, హీరోలు, కో-ఆర్టిస్టులు ఇప్పటికీ స్పందిస్తారని తెలిపింది. కృష్ణవంశీ తనను పాజిటివ్ వైబ్ అని పిలిచేవారని నటి హేమ తెలిపింది.