అలాంటి రోల్స్ ఎందుకు చేశానంటే..! సొంతవాళ్లే మోసం చేశారన్న నటి షకీలా..

Published : Jan 16, 2026, 08:43 PM IST

Actress Shakeela: నటి షకీలా తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ రోల్స్ చేయడం వెనుక కారణం ఏంటో చెప్పింది షకీలా. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి తెలుసుకుందామా.. 

PREV
15
ఆ రోల్స్ చేయడం వెనుక అసలు కారణం

నటి షకీలా తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ రోల్స్ చేయడం వెనుక అసలు కారణం ఏంటో చెప్పింది. ఆ చిత్రాల్లో నటించినప్పుడు అదనంగా బిట్స్ యాడ్ చేసిన సంగతి తనకు తెలియదని చెప్పింది.

25
పెళ్లి చేసుకోవాలని భావించినా..

ఆ విషయం తెలియగానే 2002లో ఆ రోల్స్, సినిమాల నుంచి తప్పుకున్నానని ఆమె పేర్కొంది. అప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించినా, ఆర్థిక సమస్యల వల్ల బాయ్‌ఫ్రెండ్ కూడా వదిలేశాడని చెప్పింది.

35
సినీ ప్రయాణంలో కీలక మలుపు

ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన జయం చిత్రంలో మంచి పాత్ర లభించిందని, అది తన సినీ ప్రయాణంలో కీలక మలుపు అని షకీలా పేర్కొంది. తనకు పని ఇవ్వమని ఎవరినీ అడగడం ఇష్టం లేదని, అవకాశాలు తనను వెతుక్కుంటూ వస్తేనే చేస్తానని ఆమె చెప్పింది.

45
అది నా సిద్థాంతం..

"మర్యాదగా సద్దన్నం పెడితే తింటా, మర్యాద లేకుండా ప్యారడైస్ బిర్యానీ కూడా వద్దు," అనేది తన సిద్థాంతం అని తెలిపింది. తాను స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఒక ప్రోమో చూసి కంటతడి పెట్టుకున్నానని, తన జీవితంలో జరిగిన వాస్తవాలు అందులో ఉన్నాయని ఆమె భావోద్వేగానికి లోనైంది.

55
ఆస్తి ఉంటే అమ్మి అయినా..

తల్లికి డయాలసిస్ అవసరమైనప్పుడు డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డానని, అక్క సహాయం నిరాకరించడంతో, తానే స్వయంగా మెహతా హాస్పిటల్‌లో చికిత్స చేయించానని చెప్పింది. తన పేరు మీద ఆస్తి ఉంటే అమ్మి అయినా అమ్మను కాపాడుకునేదానిని అని చెప్పుకొచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories