Chandra Siddarth: ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద టైటిల్‌తో సినిమా.. `ఆ నలుగురు` డైరెక్టర్‌ సాహసం

Published : Sep 05, 2026, 07:54 PM IST

ఫ్యామిలీ, ఎమోషనల్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాలతో మెప్పించారు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌. ఇప్పుడు అయిన అతిపెద్ద టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. మిస్టీరియస్‌ మ్యూజికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. ఇది కూడా మొదటిసారి అని చెప్పొచ్చు.

PREV
14
అతిపెద్ద టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్‌ సినిమా

`ఆ నలుగురు`, `మధుమాసం`, `అందరి బంధువయా`, `ఇదీ సంగతి`, `ఆటగదరా శివా` వంటి చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్. తాజాగా ఆయన ఒక క్రేజీ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద టైటిల్‌తో మూవీ చేయడ విశేషం. దీనికి `ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్‌ పెట్టారు. అంతేకాదు దీనికి ఉప శీర్షిక ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అని పెట్టడం విశేషం. దీంతో టైటిల్‌తోనే మూవీపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక ఈ మూవీని ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై చంద్ర సిద్ధార్థ్‌ సొంతగా నిర్మిస్తుండటం మరో విశేషం. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

24
మిస్టరీ మ్యూజికల్‌ థ్రిల్లర్‌గా సరికొత్త మూవీ

‘ఆ నలుగురు’ చిత్రంతో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇది మొట్ట మొదటి మిస్టరీ మ్యూజికల్ . సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు మూవీస్‌ రాలేదు. ఇలా జోనర్‌ పరంగానూ ఆయన ప్రయోగం చేస్తుండటం విశేషం.

34
మదన్‌ కథతో చంద్ర సిద్ధార్థ్‌ మూవీ

ఈ సందర్భంగా దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ, ‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది.నా స్నేహితుడైన మదన్ తో ఈ కథను సినిమా గా చేద్దామనుకున్నాము. ఇది మదన్ చనిపోయే ముందు చివరిగా ప్లాన్ చేసిన సినిమా. నేను అప్పట్లో మదన్ కథతోనే ‘ఆ నలుగురు’ సినిమా తీశాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ ఉంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ ఉంటారు. అందుకే ఈ సినిమాకి ‘నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్ పెట్టాను . ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది.ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం వుంది. ఇందులో నాలుగు పాటలున్నాయి. జే రెక్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’` అని అన్నారు.

44
సినిమాలోని ఆర్టిస్ట్ లు టెక్నీషియన్లు

హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: మదన్, సంగీతం: జే రెక్స్, పాటలు: చంద్ర సిద్ధార్థ్, మాటలు: పులగం చిన్నారాయణ, ఆర్ట్: అంజి కొయ్యల, సినిమాటోగ్రఫీ: సామ్ సుప్రీత్ , ఎడిటింగ్: బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్, సహ నిర్మాతలు: అగస్త్య మంజు, సాగర్, మహి, సమర్పణ: వై.వి.సత్యనారాయణ రాజు, నిర్మాత - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories