
బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. రేపు ఆదివారం(సెప్టెంబర్ 6)న సాయంత్రం 7 గంటల నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఈ సారి రసవత్తరంగా ఉండబోతుంది. క్రేజీ సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. సెలబ్రిటీల విభాగం నుంచి పది మంది కంటెస్టెంట్లు, కామనర్స్ నుంచి ఆరుగురు హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. వారి పేర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి.
బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి సెలబ్రిటీ విభాగం నుంచి రామ్ ప్రసాద్, దేబ్జానీ, టెంపర్ వంశీ, కృష్ణుడు, త్రిగుణ్, చైత్ర రాయ్, జబర్దస్త్ నరేష్, ముఖేష్ గౌడ, వర్షిణి సౌందరాజన్, సుధీర్ రెడ్డి అడుగుపెట్టనున్నారు. కామనర్స్ నుంచి ఆర్జే చరణ్, అమన్, రోహిత్ నాయుడు, సింగర్ ఝాన్సీ, షాలిని, సృష్టి వ్యాకరణం వంటి వారు హౌజ్‌లోకి వెళ్తున్నారట. మొత్తంగా అటు సెలబ్రిటీ నుంచి ఇటు కామనర్స్ నుంచి క్రేజీ కంటెస్టెంట్లు వెళ్తున్నట్టు సమాచారం. దీనిపై రేపు క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోతోపాటు బిగ్ బాస్ బజ్‌కి కూడా మంచి క్రేజ్ ఉంది. ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వస్తారు. తమ అనుభవాలను పంచుకుంటారు. తోటి కంటెస్టెంట్ల గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఎవరు బెటర్, ఎవరు రాంగ్ అనేది కూడా క్లారిటీగా చెబుతారు. దీనికి హోస్ట్ చేసేవాళ్లు కూడా చాలా ముఖ్యం. రెగ్యూలర్‌గా బిగ్ బాస్ గత సీజన్ విన్నర్స్ తో చేయిస్తుంటారు. లేదంటే అందులోనే పాల్గొన్న మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలతో యాంకరింగ్ చేయిస్తుంటారు. వాళ్లు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లని ఆడుకుంటారు. తమ ప్రశ్నలతో ఇరకాటంలో పెడుతుంటారు. అయితే మరోసారి బిగ్ బజ్‌కి శివాజీ హోస్టింగ్ చేయబోతున్నారట. ఆయన గత సీజన్‌లోనూ యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10 బజ్‌కి కూడా యాంకర్‌గా చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని కన్ఫమ్ చేశారు. అయితే ఇది వారాంతంలోనే ఉంటుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లని వీరు ఇంటర్వ్యూ చేస్తారు. ఇది ప్రతి ఆదివారం రాత్రి ప్రసారం అవుతుంది. అంటే వీక్లీ ఒక్కసారి మాత్రమే ఈ ఎపిసోడ్ ఉంటుంది. మరి ఈ యాంకరింగ్ చేసినందుకు శివాజీ ఎంత పారితోషికం తీసుకుంటున్నానేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గత సీజన్‌లో ఆయన ఒక్కో ఎపిసోడ్‌కి అంటే ఒక్కో ఇంటర్వ్యూకి మూడున్నర లక్షలు తీసుకునే వారు. మరి ఇప్పుడు కూడా రూ.3.50-4లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది 15 వారాలు ఉంటుంది. అంటే సుమారు రూ.50-60లక్షల వరకు శివాజీ పారితోషికం అందుకోబోతున్నారని చెప్పొచ్చు. ఇది విన్నర్ స్థాయి పారితోషికం కావడం విశేషం.
శివాజీ బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్‌లో పాల్గొన్నారు. ఈ షోతో ఆయన మరోసారి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత `90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్` అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికితోడు `కోర్ట్` సినిమాలో అదిరిపోయే పాత్ర దక్కింది. మంగపతిగా విశ్వరూపం చూపించారు. ఇది ఆయన ఇమేజ్‌ని మార్చేసింది. అలాగే `దండోరా`లోని పాత్రకి మంచి పేరు, ప్రశంసలు దక్కాయి. ఇటీవల అఖిల్ `లెనిన్`లోనూ కీలక పాత్రలో మెప్పించారు. ఇప్పుడు `ఎపిక్` మూవీలో హీరోకి తండ్రిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతుంది. ఇలా నటుడిగా ఫుల్ బిజీ అయ్యారు శివాజీ. మొత్తానికి `బిగ్ బాస్` ఆయన్ని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.