తాత సినిమా కథతో నాగచైతన్య భారీ హిస్టారికల్‌ మూవీ.. శోభిత ముందే ప్రకటించిన డైరెక్టర్‌

Published : Feb 12, 2025, 10:03 AM ISTUpdated : Feb 12, 2025, 09:29 PM IST

Chandoo mondeti about naga chaitanya:  నాగ చైతన్య `తండేల్‌`తో విజయాన్ని అందుకున్నారు. ఈ సక్సెస్‌ ఈవెంట్‌లో ఓ భారీ హిస్టారికల్‌ మూవీని ప్రకటించారు దర్శకుడు చందూమొండేటి. అదేంటో ఈ కథనంలో చూద్దాం.   

PREV
15
తాత సినిమా కథతో నాగచైతన్య  భారీ హిస్టారికల్‌ మూవీ.. శోభిత ముందే ప్రకటించిన డైరెక్టర్‌

Chandoo mondeti about naga chaitanya: `తండేల్‌` సక్సెస్‌ సెలబ్రేషన్‌లో దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు. నాగచైతన్యతో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించారు. భారీ హిస్టారికల్‌ మూవీ చేయబోతున్నట్టు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు చేసిన `తెనాలి రామకృష్ణ` కథని ఇప్పటి జనరేషన్‌కి, ట్రెండ్‌కి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందించబోతున్నట్టు తెలిపారు. `తండేల్‌` సక్సెస్‌ వేదికగా చందూ మొండేటి ఈ విషయాన్ని ప్రకటించారు. 

25

నాగ చైతన్య, సాయిపల్లవితో కలిసి `తండేల్‌` మూవీలో నటించారు. దీనికి చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌, బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శిస్తుంది. చాలా కాలం తర్వాత అంటే దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత చైతూకి హిట్‌ పడింది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో ఆడియెన్స్ లో ఊపు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. 
 

35

ఈ ఈవెంట్‌కి నాగ చైతన్య భార్య, హీరోయిన్‌ శోభితా కూడా వచ్చింది. ఈ మూవీ హీరోయిన్‌ సాయి పల్లవి ఈవెంట్‌ కి రాలేదు. కానీ ఆ లోటుని శోభితా తీర్చిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా శోభితాని ఉద్దేశించి చందూ మొండేటి మాట్లాడుతూ ఆమెకి తెలుగు బాగా మాట్లాడుతుందని, అదే లాంగ్వేజ్‌ని యథావిధిగా చైతూకి ట్రాన్స్ ఫర్‌ చేయండి అని తెలిపారు. ఎందుకంటే చైతన్యతో ఏఎన్నార్‌ చేసిన తెనాలి రామకృష్ణ కథని భారీ స్థాయిలో చేయబోతున్నట్టు చెప్పారు.

45

`ఫ్యూచర్‌లో ఒక గొప్ప హిస్టారికల్‌ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు చేసిన తెనాలి రామకృష్ణ అనే కథని, మళ్లీ అత్యద్భుతంగా రాసి ఈ తరానికి ఎలా కావాలి, ఈ తరానికి ఏం చెప్పాలి అనేదాంట్లో, తెనాలి రామకృష్ణ అనే పాత్ర చాలా అత్యద్భుతమైన పాత్ర, హిస్టారికల్‌ రోల్‌, దాన్ని ఏఎన్నార్‌ బాగా చేశారు, మళ్లీ దాన్ని చైతూ చేస్తారు, భవిష్యత్‌లో ఈమూవీ చేయబోతున్నాం` అని తెలిపారు చందూ మొండేటి. అక్కినేని ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌ ఇచ్చారు. 

ఇక `తండేల్‌` మూవీ విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇది సుమారు 70కోట్లు దాటింది. వంద కోట్ల దిశగా వెళ్తుంది. మరి 100కోట్లు టచ్‌ చేస్తుందా? అనేది చూడాలి. ఈ సినిమా అనంతరం చైతూ నెక్ట్స్ `విరూపాక్ష` ఫేమ్‌ కార్తిక్‌ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది. ఆ తర్వాతబోయపాటితో ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

55

అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన `తెనాలి రామకృష్ణ` మూవీ హిస్టారికల్‌ పొలిటికల్‌గా డ్రామాగా 1956లో రూపొందింది. దీనికి బీఎస్‌ రంగా దర్శకత్వం వహించగా, ఇందులో తెనాలి రామకృష్ణ గా అక్కినేని, శ్రీకృష్ణదేవరాయలు గా ఎన్టీఆర్‌ నటించారు. భానుమతి, జమున, ఆర్‌ బాలసరస్వతి దేవి, నాగయ్య ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో ఇది విశేష ఆదరణ పొందింది. 

read more: కోడలు శోభితాకి `తండేల్‌` సక్సెస్‌ క్రెడిట్‌ ఇచ్చిన నాగార్జున.. నాగ చైతన్యపై ఎమోషనల్‌ కామెంట్స్

also read: ఇంట్లో చుట్టూ ఆడపిల్లలే, హాస్టల్‌ కి వార్డెన్‌లా ఉన్నా, అరే చరణ్‌ ఒక అబ్బాయిని ఇవ్వురా.. చిరుపై ట్రోల్స్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories