laila Controversy: ''సంక్రాంతికి వస్తున్నాం'' సినిమాలో బాల నటుడు రేవంత్ పవన్ సాయి సుభాష్ (బుల్లి రాజు) లైలా సినిమా ప్రమోషన్ వీడియో వివాదంలో చిక్కుకున్నాడు. బుల్లి రాజు పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయబడిన వీడియో, వైసీపీ బాయ్‌కాట్ పిలుపుతో కలిసి వివాదాన్ని రేకెత్తించింది.
Sankranthiki vasthunam bulli raju in laila Movie Controversy in telugu
రేవంత్ పవన్‌సాయి సుభాష్ (బులిరాజు). ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బాల నటుడిగా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎవరినోట విన్నా రేవంత్ పేరు వినిపిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’రిలీజ్ తర్వాత ప్రమోషన్ ఈవెంట్స్ లోనూ పాల్గొన్నాడు. కొరికేత్తాను అనే డైలాగు బాగా పాపులర్ అయ్యింది.
దాంతో ఈ పిల్లాడుతో ప్రమోషన్స్ చేయించాలనే ఆలోచన విశ్వక్సేన్ లైలా టీమ్ కు వచ్చింది. దాంతో వాళ్లు ఓ ప్రమోషన్ వీడియో చేసారు.అంతవరకూ బాగానే ఉంది కానీ అది బులి రాజు పేరుతో ఉన్న సోషల్ మీడియా ఎక్కౌంట్ లో పోస్ట్ అయ్యింది. అయితే అది ఒరిజనల్ ఎక్కౌంట్ లా అయితే లేదు. కానీ చాలా మంది అదే ఒరిజనల్ ఎక్కౌంట్ అనుకుని తిట్టిపోస్తున్నారు. వైసీపీ వారు లైలా సినిమాని బాయ్ కాట్ చేయమని ట్వీట్స్ చేస్తున్న నేపధ్యంలో ఈ బుల్లి రాజు వీడియో వచ్చి ..వివాదంగా మారింది.
23
Sankranthiki vasthunam, bulli raju, laila
బులి రాజు అనే పేరుతో ఉన్న ఈ ట్విట్టర్ ఎక్కౌంట్ లో పెట్టిన పోస్ట్ లో ...అరేయ్ పేటీఎమ్స్ మీరు బాయ్ కాట్ అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు మా లైలా పిన్ని కోసం నేనున్నా . అందుకే నేను ఈ సినిమా ప్రమోట్ చేస్తున్నా అంటూ వీడియోని షేర్ చేస్తూ రాసుకొచ్చాడు. అది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వింగ్ కోపం తెప్పించింది. కొందరు బూతులు తిడుతూ మరీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కొందరు కావాలనే ఈ పిల్లాడని ఫేక్ ఎక్కౌంట్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేసి ఇరికించారని అంటున్నారు. అయితే అందులో నిజమెంత ఉన్నా చిన్న పిల్లాడిని బూతులు తిట్టడం, తిట్టేలా ప్రేరేపించేలా పోస్ట్ లు పెట్టడం రెండూ తప్పే.
33
Viswak Sen
రేవంత్ అనే ఈ పిల్లాడు గత సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశాడు. ప్రచార వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. అది వైరల్ కావడంతో దిల్‌రాజు, అనిల్ రావిపూడి చూశారు. ‘నిర్మాత దిల్‌రాజు కార్యాలయంలో ఆడిషన్స్ చేశారు.
అక్కడ తన కుమారుడిని ఎంపిక చేశారు’ అని బులిరాజు తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. ఏదో సినిమా చేస్తున్నాడని అనుకున్నాంగానీ ఇంతపేరు వస్తుందని ఊహించలేదన్నారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా గుర్తు పట్టి నువ్వు బులిరాజువు కదా అని అడుగుతున్నారని.. కొందరు ఫొటోలు దిగుతున్నారని ఆయన తెలిపారు.