Chaitra Rai Remuneration: బిగ్ బాస్ తెలుగు 10 నుంచి మొదటి వారంలోనే చరణ్, చైత్ర రాయ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మరి ఆమెకి ఎంత పారితోషికం దక్కుతుందనేది చూస్తే.
రేటింగ్ కోసం బిగ్ బాస్ లో ట్విస్ట్ ల మీద ట్విస్టులు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభమై మొదటి వారం పూర్తి కావస్తుంది. సెప్టెంబర్ 6న స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా 16 మంది కంటెస్టెంట్లతో షోని స్టార్ట్ చేశారు. ఈ సారి సెలబ్రిటీ విభాగంలో క్రేజీ కంటెస్టెంట్లు వచ్చారు. మంచి పేరున్న వారినే తీసుకొచ్చారు. దీంతో షోపై ఆసక్తి ఏర్పడింది. కానీ అనుకున్న స్థాయిలో దీనికి రేటింగ్ రావడం లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులు ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ హడావుడి చేశారు.
24
మిడ్ వీక్‌లో ఇద్దరు ఎలిమినేట్
మొదటి వారంలోనే మిడ్ వీక్‌లో ఇద్దరు కంటెస్టెంట్లని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. నాల్గో రోజు చరణ్‌ని హౌజ్ నుంచి పంపించారు. ఐదో రోజు చైత్రని ఎలిమినేట్ చేశారు. ఒకే వారంలో, అది కూడా ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లకి షాకిస్తుంది. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లు కంటెస్టెంట్లకి మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఎలిమినేట్ అయిన వారిని సీక్రెట్ హౌజ్‌లో పెట్టారని, మళ్లీ సండే రోజు వారిని హౌజ్‌లోకి తీసుకొస్తారనే ఊహల్లో కంటెస్టెంట్లు, ఆడియెన్స్ ఉన్నారు. కానీ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నాగార్జున. శనివారం ఎపిసోడ్‌లో డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో మాట్లాడారు. వాళ్లు వాళ్ల ఇంట్లకి వెళ్లిపోయారు.
34
చైత్ర రాయ్ పారితోషికం
దీంతో మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన చరణ్, చైత్ర రాయ్ మళ్లీ కమ్ బ్యాక్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాకపోతే బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి మాత్రం ఒకరిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందంటున్నారు. మరి అది ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. ఇక రెండో ఎలిమినేట్ అయిన చైత్ర రాయ్ కి ఎంత పారితోషికం ఇచ్చారు. ఆమె ఐదు రోజులకు ఎంత తీసుకుందనేది చూస్తే, ఆమెకి వారానికి రూ.2.5లక్షల పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. అంటే రోజుకి రూ.35వేలు. ఇప్పుడు ఆమె ఐదు రోజులు హౌజ్‌లో ఉంది. అంటే సుమారు రూ.1.75లక్షలు పొందుతారని చెప్పొచ్చు. అయితే హౌజ్‌లో ఉన్న రోజులకే పారితోషికం ఇస్తారా? వారానికి కన్సిడర్ చేసి ఇస్తారా అనేది సస్పెన్స్. చాలా వరకు వారానికి పరిగణించి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ లెక్కన చైత్ర రాయ్‌కి రూ.2.5లక్షలు అందుతాయని చెప్పొచ్చు.
తన పది నెలల చిన్నారిని వదిలేసి తానేంటో మళ్లీ నిరూపించుకునేందుకు బిగ్ బాస్ షోకి వచ్చినట్టు చెప్పింది చైత్ర రాయ్. కానీ ఆమె మొదటి వారంలోనే ఐదు రోజులకే హౌజ్‌ని వీడాల్సి రావడం విచారకరం. అయితే ఇది బిగ్ బాస్ షోపై బజ్ కోసం నిర్వాహకులు చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు. కానీ అది పాజిటివ్ కంటే నెగటివ్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా చేయడం సరికాదంటున్నారు. వాళ్లేంటో నిరూపించుకునే టైమ్ ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు బిగ్ బాస్ లవర్స్.