రెండు సినిమాలు విడుదలై రెండు రోజులు పూర్తయినప్పటికీ, వరల్డ్ వైడ్ కలెక్షన్లలో 'మండాడి' ముందున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, 'సర్దార్ 2' రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.65 కోట్లు వసూలు చేయగా, 'మండాడి' రూ.15.85 కోట్లు రాబట్టింది.
దీంతో, కార్తి 'సర్దార్ 2' కంటే సూరి 'మండాడి' దాదాపు రూ.5.20 కోట్లు ఎక్కువగా వసూలు చేసింది. 'సర్దార్ 2'కు వస్తున్న మిక్స్‌డ్, నెగెటివ్ టాక్ దాని కలెక్షన్ల వేగాన్ని తగ్గించిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే 'విడుదల', 'విడుదల 2', 'గరుడన్', 'మామన్' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న సూరికి, 'మండాడి' కూడా మరో సక్సెస్‌గా నిలుస్తుందా లేదా అనే ఆసక్తి పెరిగింది.