ఇదిలా ఉంటే `ఆదర్శ కుటుంబం` టీజర్ లో పెద్దగా కొత్తదనం కనిపించలేదు. ఇటీవల వెంకటేష్ వరుసగా ఫ్యామిలీ చిత్రాలు చేశారు. `దృశ్యం`, `సంక్రాంతికి వస్తున్నాం` వంటి చిత్రాల తరహాలోనే ఈ టీజర్ కనిపించింది. ఫ్యామిలీ అంశాలు, ఫన్నీ డైలాగులు తప్ప కొత్తగా ఏం లేదు. మరి సినిమాలో కొత్తదనం ఉంటుందేమో చూడాలి. అయితే ఇటీవల మంచి ఫ్యామిలీ కథతో వచ్చిన మూవీస్ ఆకట్టుకుంటున్నాయి. పెద్ద హిట్ అవుతున్నాయి. ఆ కోవలోనే ఈ చిత్రం నిలుస్తుందా అనేది చూడాలి. ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.