అవును ఈ చిన్నది మరెవరో కాదు అందాల తార హన్సికానే. 2003లో హిందీలో వచ్చిన హవా అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ చిన్నది. ఆ తర్వాత కోయీ మిల్ గయా, జాగో, హమ్ కౌన్ హై, అబ్రకదబ్రా వంటి చిత్రాల్లో నటించింది. ఇక 2007లో 16 ఏళ్ల వయసులో అల్లు అర్జున్ సరసన దేశ ముదురు చిత్రంలో నటించి మెప్పించింది.
మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిది. తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల డెబ్యూట్ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.