ఐబొమ్మ రవికి ఫుల్ సపోర్ట్, వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిర్మాత బన్నీవాసు

Published : Nov 23, 2025, 08:26 AM IST

Bunny Vas Strong Counter : పేద ప్రేక్షకుల దేవుడు అని ఐబొమ్మ రవికి కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీని విమర్శిస్తూ.. పైరసీ సైట్ ను సపోర్ట్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు నిర్మాత బన్నీ వాసు. ఆయన ఏమన్నారంటే? 

PREV
14
ఐబొమ్మ రవికి సపోర్ట్ గా పోస్ట్ లు

సినిమాల పైరసీ కేసు టాలీవుడ్ లో ఎంత రచ్చ క్రియేట్ చేసిందనే విషయం తెలిసిందే. ఐబొమ్మ సైట్ తో కొత్త సినిమాలను ఫ్రీగా ఆడియన్స్ కు అందిస్తున్న సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ అరెస్టు తర్వాత ఆ వెబ్‌సైట్ మూతపడింది. అయితే సోషల్ మీడియాలో కొంతమంది వినియోగదారులు ఐ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. అతను చేసింది తప్పే అయినా సినిమా టికెట్ రేట్లు పెరిగిపోయాయి కాబట్టే పైరసీ చూడాల్సి వస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

24
నిర్మాత బన్నీ వాసు కౌంటర్లు..

ఇక రీసెంట్ గా ఒక సినిమా సక్సెస్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసును ఈ విషయంలో మీడియా ప్రతినిథులు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రవికి వస్తున్న సపోర్ట్ పై ఆయన కాస్త లాజికల్ గా స్పందించారు. వాసు మాట్లాడుతూ.. “ఒక తప్పు వల్ల ఇంకొకరికీ బెనిఫిట్ జరిగి వాళ్లు ఆనందంగా ఉన్నారని తెలిసి.. వాళ్లు అలా మాట్లాడుతున్నారు. కానీ రేట్లు పెరిగాయి కాబట్టే పైరసీ చూస్తున్నాం అని చెప్పడం సరైన లాజిక్ కాదు. ఒక వంద సినిమాలు వస్తే రేట్లు ఎక్కువగా ఉన్నవి పాతిక సినిమాలు మాత్రమే. మరి ఆ పాతిక సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ పాతిక సినిమాల్నే ఐ బొమ్మలో చూస్తున్నారా?” అని రివర్స్ ప్రశ్నించారు బన్నీవాసు.

34
ఎవరూ ఖండించడం లేదు

బన్నీ వాసు మాట్లాడుతూ.. “చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ పైరసీ అవుతున్నాయి. వంద రూపాయల టికెట్ ఉన్న సినిమాలు కూడా, 150 రూపాయల టికెట్ ఉన్న సినిమాలు కూడా పైరసీ అవుతున్నాయి. రేట్లు పెంచారు అందుకే పైరసీ చూస్తున్నాం అనడం సరైన మాట కాదు. పైగా పైరసీ తప్పు కాదు అని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దీనిని ఎవరూ ఖండించడం లేదు. పైరసీ వల్ల ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుతుందో ఎవరూ ఆలోచించడం లేదు” అని బన్నీ వాసు అన్నారు.

44
నిర్మాతల కష్టాల గురించి మాట్లాడుతూ...

“చిన్న సినిమాల నిర్మాతలు తమ ఆస్తులను తాకట్టు పెట్టి సినిమాలు తీస్తారు. చాలా మందికి డబ్బులు తిరిగిరాక, అప్పులపాలు అయ్యి,డబ్బులు పోగొట్టుకొని వెళ్లిపోతున్నారు. అలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? మంచి సినిమాలు కూడా పైరసీ వల్ల లాస్ అయ్యాయి. నిర్మాతలంటే డబ్బున్న వాళ్లని అనుకుంటారు, కానీ అందరూ అలాంటి వారు కాదు. నిర్మాతల కష్టాలు బయటకు చెప్పుకోరు” అని బన్నీ వాసు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories