బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ కార్తీక్ ఆర్యన్, తన నటన, హిట్ సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సాధారణ స్థాయి నుంచి టాప్ హీరోగా ఎదిగిన అతని సంపద, ఆస్తులు, జీవనశైలి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ కార్తీక్ ఆర్యన్ తన నటన, బాక్సాఫీస్ విజయాలతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. సాధారణ స్థాయి నుంచి బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే యువతారగా ఎదిగాడు.
26
కార్తీక్ ఆర్యన్ ఆస్తి విలువ
కార్తీక్ ఆర్యన్ నికర ఆస్తి విలువ రూ. 250 కోట్లు. ఒక్కో సినిమాకు రూ. 45-50 కోట్లు తీసుకుంటాడని సమాచారం. దీంతో అతను ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న యువ నటులలో ఒకడిగా నిలిచాడు. వివాదాల్లో తలదూర్చకుండా కార్తీక్ ఆర్యన్ సైలెంట్ గా సినిమాలు చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నాడు.
36
కార్తీక ఆర్యన్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్
సినిమాలే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కార్తీక్ భారీగా సంపాదిస్తున్నాడు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రూ. 3-5 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఇది అతని సంపదను మరింత పెంచుతోంది.
కార్తీక్ రియల్ ఎస్టేట్‌లో తెలివైన పెట్టుబడులు పెట్టాడు. 2023లో జుహులో రూ.17.50 కోట్లతో ఓ అపార్ట్‌మెంట్ కొన్నాడు. అంధేరీ వెస్ట్‌లో రూ.13 కోట్లతో ఆఫీస్ స్పేస్ కూడా కొనుగోలు చేశాడు.
56
కార్ల కలెక్షన్
కార్తీక్ వద్ద విలాసవంతమైన వాహనాల కలెక్షన్ ఉంది:
రేంజ్ రోవర్ ఎస్‌వి (₹6 కోట్లు)
మెక్‌లారెన్ జిటి (₹4.7 కోట్లు)
లంబోర్ఘిని ఉరుస్ (₹4.5 కోట్లు)
పోర్షే 718 బాక్స్‌స్టర్ (₹1.5–1.6 కోట్లు)
అతనికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు కూడా ఉన్నాయి.
66
విలాసవంతమైన వెకేషన్స్
కార్తీక్ గ్లామరస్ లైఫ్‌స్టైల్‌తో పాటు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాడు. విలాసవంతమైన వెకేషన్స్‌కి వెళ్తాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.