సోషల్ మీడియా వచ్చి ఎక్కడ టాలెంట్ ఉన్నా గుర్తించి పాపులర్ చేస్తుంది. టాలెంట్ ఉన్న వాళ్లు ఆ టెక్నాలజీ(సోషల్ మీడియా) ద్వారా తమ ప్రతిభని బయటపెట్టడమే వాళ్లు చేయాల్సింది. ప్రియా ప్రకాష్ వారియర్‌ని అదే సామాజిక మాధ్యమాలు పాపులర్ చేశాయి. ఏకంగా ఇండియా వైడ్‌గా పాపులారిటీని తీసుకొచ్చింది. క్రేజ్‌ని తీసుకొచ్చింది.
కన్నుగీటుతోనే యావత్ కుర్రాళ్ల ప్రపంచాన్ని పడేసిందీ వింక్ బ్యూటీ. టీనేజ్ అందంతో ఆకట్టుకునే ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్కదెబ్బకే పాన్ ఇండియా బ్యూటీ అయిపోయింది. ఒక్క సినిమా చేయకుండానే పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. దీంతో అదే స్థాయిలో అన్ని భాషల్లోనూ అవకాశాలను అందుకుంటుంది.
`ఓరు ఆడార్ లవ్` మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్‌తో `చెక్` మూవీ చేసింది. అలాగే `ఇష్క్` లోనూ మెరిసింది. రెండుసినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఇక్కడ ఆఫర్లు తగ్గాయి. కానీ మలయాళంలో ఆఫర్లువచ్చాయి. అక్కడ ఒకే ఏడాది నాలు సినిమాలు చేసింది.
ఇప్పుడు తెలుగులోకి `బ్రో` చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. `పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న విడుదల కానుంది. ఇందులో సాయికి లవ్ ఇంట్రెస్ట్ గా ప్రియా ప్రకాష్ వారియర్ కనిపిస్తారని సమాచారం. అలాగే హిందీలో ఏకంగా నాలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ బిజీగా ఉంది. ఓ కన్నడ మూవీ చేస్తుందీ భామ.
ఇదిలా ఉంటే పాపులారిటీతోపాటు గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తూ మరింతగా ఆడియెన్స్ కి దగ్గరవుతుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందులో భాగంగా బికినీలో మెరిసింది ప్రియా ప్రకాష్ వారియర్. సముద్రంలో స్విమ్ చేస్తూ బికినీలో రెచ్చిపోయింది. ఎగిసిపడే ఎద అందాలతో బాంబ్‌లా పేలిందీ వింక్ బ్యూటీ.
అంతేకాదు తన ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ చేసింది. ముగ్గురు కలిసి బికినీలో రెచ్చిపోయారు. ఓ వైపు టాప్ షోలో, మరోవైపు థైస్ షో. ఇది పర్ ఫెక్ట్ సండే ట్రీట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. థాయ్‌లాండ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుందీ ప్రియా ప్రకాష్ వారియర్.
ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్ బాంబ్ అని, బతకనేర్చిందని, ఇప్పుడు ఈ రేంజ్‌లో షో చేస్తే ఇక మున్ముందు పండగే అని అంటున్నారు. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే ఇది చేయాల్సిందే అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ లేటెస్ట్ బికినీ ఫోటోలతో నెటిజన్లకి సండే ట్రీట్ ఇచ్చిందీ వింక్ బ్యూటీ.