అంతేకాదు మనం ఎంతో జీవితాన్ని చూసాము నటనకు ప్రేమకు తేడా తెలియదని వాళ్లు అనుకుంటున్నారు అంటాడు రాజా. వాళ్లు ఎప్పటికైనా ఒకటవుతారు నువ్వు బాధపడకు అని రాణి కి ధైర్యం చెబుతూ ఉంటాడు రాజా. మరొకవైపు యష్, వేద కార్లు వెళ్తూ ఉండగా ఒకటవుదామని వచ్చాము కానీ ఒప్పంద బంధం తప్పితే మా మధ్య ఏ బంధము చిగురించలేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి వేద అమ్మమ్మ వాళ్ళని వదిలి వెళుతున్నందుకు బాధపడుతున్నావా అనగా లేదని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది వేద. నేను నిజంగానే ఆయన్ని ప్రేమిస్తున్నానా ఆయన నన్ను ప్రేమించడం లేదా. మా మధ్య కేవలం ఒప్పందం మాత్రమే ఉందా , అంటూ యష్ వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది వేద.